సినిమా హీరోలు అనగానే ముందుగా వారు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం పైకి ఆలోచన వెళ్లుతుంది. అయితే ఈ రెమ్యునరేషన్ విషయంలో ఎవరి రేటు వారిదే. ఒక్కో హీరో ఒక్కో విధంగా తనకున్న మార్కెట్‌ను బట్టి తన రెమ్యునరేషన్ నిర్ణయించుకుంటాడు. అందులో కొందరి హీరోలకు ఇచ్చే పారితోషకం ఎంతో తెలిస్తే కళ్లలోని నల్ల గుడ్లు కాస్త తెల్లబడటం ఖాయం..

 

 

అయితే ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం సంక్రాంతి సంబరాలు తేవడానికి పందెం కోళ్లతో పాటుగా బరిలోకి దిగుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో చిత్రానికి బన్నీ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే బుర్రతిరగడం ఖాయమట. ఇకపోతే ఇప్పటికే పదహరణాల పడుచు యువతి పట్టుపరికిణి ధరించి వాలుజడను అలా ఊపుకుంటు వెళ్లుతుంటే వయస్సు మీదున్న కుర్రవాళ్ల గుండెల్లో మొదలయ్యే అలజడి ఎలా ఉంటుందో ఈ అల వైకుంఠపురములో చిత్రానికి థమన్ అందించిన సంగీతం, అందులోని పాటలు అంతగా యువత మనస్సులో చెదరని ముద్ర వేసాయి.

 

 

అంతే కాకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.. ఇదిలా ఉండగా ఈ సినిమాతో బన్నీ-త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు మరోసారి సిద్ధమయ్యారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్, థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి మొత్తంగా రూ.135 కోట్లు జరిగినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ హయ్యెస్ట్‌గా నిలిచిందట.

 

 

ఇదే కాకుండా ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ భారీగానే పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపుగా రూ.35 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఈ సినిమా కోసం బన్నీ తీసుకున్నట్లు సినివర్గాల్లో గుసగుసలట. ఇక సౌత్ ఇండియాలో చూస్తే ఇంతటి భారీమొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు.. ఇక ఏదేమైనా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఈ మూవీతో దక్కించుకున్నాడు అల్లు అర్జున్..

మరింత సమాచారం తెలుసుకోండి: