పంచు డైలాగుల రారాజు ఎవరయ్యా అంటే దానికి సమాధానం హైపర్ ఆది అని ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పుకోవచ్చు. నెలకి కేవలం రూ.వేలను సంపాదించే ఆది ప్రస్తుతం నెలకు చాలా లక్షలను సంపాదించే వాడయ్యాడంటే దానికి కారణం అతడి హాస్యభరితమైన పంచులే. డబ్బుతో పాటు తను తన పాపులారిటీని ఎంతగా పెంచుకున్నాడు అంటే... అంతటి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోనే ఇతని పేరు యూజ్ చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు మురుగదాస్.


అసలు విషయానికొస్తే.. తాజాగా రజినీకాంత్ సినిమా దర్బార్ విడుదలైంది. ఈ సినిమాని కేవలం రజినీకాంత్ అభిమానులకు నచ్చే విధంగా గొప్ప దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించారు. గత పదేళ్లలో వచ్చినటువంటి తమిళ్ రజినీకాంత్ సినిమాలు బాగానే ఉన్నాయి కానీ రజనీకాంత్ ఫ్యాన్స్ కి మాత్రం నచ్చలేదు. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ యూజ్ చేసే మితిమీరిన హీరోయిజం నమ్ముకొని దర్బార్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. రజనీ ఊహించిన విధంగానే సినిమాకి బాగానే రెస్పాన్స్ వస్తోంది.


ఇకపోతే, హైపర్ ఆదిని మురగదాస్ ఎలా యూస్ చేసారంటే... ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో హీరో రజినీకాంత్ ని తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక పెళ్లి వేడుకకు పిలుస్తుంది హీరోయిన్ నయనతార. రజినీ ఆ వేడుక కి వచ్చిన తర్వాత.. ' ఒక చిన్నపిల్ల మెడలోని బంగారపు గొలుసు ఈ పెళ్లి వేడుకలో పోయింది. కొంచెం వెతికి పెట్టండి' అంటూ మర్యాదగా కమీషనర్ అయిన రజనీకాంత్ కు ఫిర్యాదు చేస్తుంది నయనతార. దాంతో రజనీ మాట్లాడుతూ.. ' ఏంటమ్మా ఇక్కడికి కమిషనర్ వచ్చింది చిన్నపిల్ల చైన్ వెతకడానికా?' అంటూ నయనతారతో చమత్కారం ఆడతారు.


ఆ తర్వాత ఆ చిన్న పిల్లని పిలిచి.. 'చైన్ ఎక్కడ పోగొట్టుకున్నావ్, అమ్మ?' అని రజినీకాంత్ ప్రశ్నించగా.. ' అది తెలిస్తే మేమే పోయి వెతుక్కుంటాం కదా అంకుల్. మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం చెప్పండి' అంటూ ఆ బాలిక పంచ్ డైలాగ్ విసరగానే రజనీ నోరెళ్లబెడతారు.


ఆ సందర్భంలోనే రజనీ పక్కనే ఉన్న యోగిబాబు అనే ఒక హాస్య నటుడు.. ' ఇదంతా హైపర్ ఆది ఎఫెక్ట్, సార్. అందుకే పంచులు ఇలా వస్తున్నాయి. మనమేం చేయలేం సార్', అంటూ బిక్కమొహం వేస్తాడు. దాంతో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులంతా మరొకసారి పకపకా నవ్వుతారు. సో, ఈ విధంగా నవ్వులు పూయించడానికి హైపర్ ఆది పేరుని దర్శకుడు మురుగదాస్ వాడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: