సూపర్ స్టార్ రజనీకాంత్-నయనతార హీరో హీరోయిన్స్ గా సెన్షేషనల్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దర్బార్' ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయింది. గత రెండు రోజులుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన రజనీ దర్బార్ అంటూ థియోటర్స్ లోకి వచ్చారు. రజనీ ఫ్యాన్స్ థియేటర్ ముందు సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి నానా హంగామా చేశారు. అంతేకాదు 13 ఏళ్ళ తర్వాత దర్బార్ లో సినిమాలో రజినీకాంత్ పోలీస్ గెటప్ ఆయన మార్క్ నటన అద్భుతం అని తలైవా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

ముఖ్యం గా చెన్నై లో ఫ్యాన్స్ ఉత్సాహం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 9 ఏళ్ళ నుంచి తమ అభిమాన హీరో, తలైవా రజినీకాంత్ ను తన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో మురగదాస్ అలా చూపించారని ఈ ఏజ్ లో కూడా రజిని యూత్ హీరోగా చెలరేగిపోయారని నానా హంగామా చేస్తున్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే సినిమా రజనీకి పెద్ద షాకిచ్చింది. 

 

ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ అండ్ రొమాంటిక్ గా సాగిందట. అయితే ఇది ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదట. ఈ వయసులో రజనీ నయనతార తో రొమాన్స్ ఎబ్బెట్టుగా ఉందని మరీ సిల్లీగా సీన్స్ ఉన్నాయని ఫ్యాన్సే అంటున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గ్రాండ్ ఎంట్రి తప్ప ఏం లేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు కనీసం యావరేజ్ టాక్ కాదు ఏకంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక దర్శకుడిని బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు మురగదాస్ తీశాడా లేక ఆయన అసోసియోట్ తీశాడా అంటూ మాట్లాడుకుంటున్నారు.  

 

ఇక టాలీవుడ్ లో రజనీ దర్బార్ గురించి ఎవరు అంత ఆసక్తిగా మాట్లాడుకోవడంలేదు. ఆయన గత సినిమాలు కబాలి, కాలా, పేట ఇక్కడ భారీ డిజాస్ట్రస్ కావడంతో ఇప్పుడు దర్బార్ కూడా అదే లిస్ట్ లో చేరిపోతుందనుకున్నారు. అనుకున్నట్టుగానే రజనీకి ఈ సినిమా గట్టి షాకిచ్చింది. గత భారీ డిజాస్టర్స్ లో ఈ దర్బార్ కూడా చేరిందని అందరు చెప్పుకుంటున్నారు. మరి రజనీ ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారో అర్థం కావడంలేదు. గత కొన్నేళ్ళుగా తన ఫ్యాన్స్ ని దారుణంగా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న భారీ పోటీ నుంచి దర్బార్ చక్కగా సర్ధుకున్నట్టేనని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: