సెన్షేషనల్ క్రియోటివ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్-నయనతార హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా 'దర్బార్'. నివేదా థాంస్ ముఖ్య పాత్రలో నటించగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి విలన్ గా నటించారు. అంతేకాదు 13 ఏళ్ళ తర్వాత దర్బార్ లో సినిమాలో రజినీకాంత్ పోలీస్ గెటప్ ఆయన మార్క్ నటన అద్భుతంగా ఉందని తలైవా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అనే టాక్ ని తెచ్చుకుంది. దానికి తోడు థియోటర్స్ కూడా రజనీకి కావలసినన్ని దొరకలేదట. అందుకు ఒక పెద్ద నిర్మాత కారణం అని రజనీ ఫీలవుతున్నారట.

 

విక్టరీ వెంకటేష్- అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన వెంకీ మామ క్లీన్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. నిర్మాత సురేష్ బాబు సొంత రిలీజ్ కావడంతో థియేటర్ల పరంగా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తుందంటే అది సురేష్ బాబు వల్లే. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ కాకపోవడం ఇంకా పెద్ద ప్లస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోందట. అందుకు కారణం ఈ సినిమాకి మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడం బాగా కలిసొచ్చింది. 

 

అయితే ఈ రోజు 9 న సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు థియేటర్ల పరంగా సురేష్ బాబు సపోర్ట్ పెద్దగా లభించలేదని టాక్ వినిపిస్తోంది. రజనీ సినిమా రిలీజ్ అయినా వెంకీమామని ఇంకా థియేటర్లో ఆడించే ప్రయత్నం చేస్తున్నారుట. రజనీ దర్బార్ కి తెలుగు స్టేట్స్ లో అనుకున్నన్ని థియేటర్లు దక్కలేదన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల సురేష్ బాబు వోన్ రిలీజ్ కావడం వల్లనే దర్బార్ కి థియేటర్ల పరంగా ఇబ్బంది నెలకొందని అంటున్నారు. మరి ఈ కామెంట్స్ కి సురేష్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే అనుకున్నంతగా దర్బార్ సక్సస్ టాక్ ని తెచ్చుకోలేకపోయింది. ఒకవేళ సురేష్ బాబు గనక థియోటర్స్ ఇచ్చి ఉంటే వెంకీ మామ కలెక్షన్స్ కి కాస్త దెబ్బై ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: