స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్-పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్' కు కాపీ అనే సంగతి తెలిసిందే. అయితే కాపీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.. ప్రభాస్ 'సాహో' థీమ్ కూడా 'లార్గో వించ్' కథకు దగ్గరగా ఉంటుంది. ఈ విషయం పై నెటిజన్లు స్పందించడం.. 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలె ప్రతిస్పందించడం కూడా అందరికి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు.. కేసులు గట్రా వేస్తే అది తేలదని అనుకున్నారో ఏమో కానీ లీగల్ యాక్షన్ మాత్రం తీసుకోకుండా అలానే వదిలేశారు.

 

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జెరోమ్ సాలె మన ఫ్రీమేక్ ల పై స్పందించారు. ఒక నెటిజన్ జెరోమ్ సాలె తో "మీ లార్గో వించ్ కు మరో వెర్షన్ ఈ వారంలోనే వస్తోంది. ఆ సినిమానే 'అల వైకుంఠపురములో' అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన జెరోమ్ 'అద్బుతం'... 'లార్గో కు బెస్ట్ ఫ్రీమేక్ అంటూ ఒక అవార్డు ఏర్పాటు చేద్దాం' అంటూ జవాబిచ్చారు. ఆ నెటిజన్ 'అల వైకుంఠపురములో' ప్రోమోస్ లో ఏం గమనించాడో ఏమో తెలియదు గానీ ఇలా స్పందించడం ఆశ్చర్యకరం. ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ తన సినిమాను అదే పనిగా కాపీ కొడుతున్నారని ఎందుకు అనుకుంటున్నారో ఏమో.. ఇప్పటికే రెండు సార్లు జరిగింది కాబట్టి మరోసారి కూడా ఫ్రీమేక్ చేసే ఉంటారని ఫిక్స్ అయినట్టున్నాడు. అయినా ఆయనకు తెలియని విషయం ఏంటంటే లార్గో వించ్ ను తాకితే బొగ్గు అవుతున్నారు. ఈ విషయం మన దర్శకులకు ఎప్పుడో అర్థమైంది. ఇక బుద్ది బుర్ర ఉన్నవాళ్ళు ఎవరూ ఇప్పట్లో ఆ సినిమాను కాపీ చేసే ఆలోచన, ధైర్యం చెయ్యరు.

 

అవన్నీ పక్కన పెడితే 'అల వైకుంఠపురములో' రిలీజ్ కాకముందే ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ ఇలా స్పందించడం కరెక్ట్ కాదని చాలామంది రివర్స్ అవుతున్నారు. ట్రైలర్ చూస్తే ఏం తెలుస్తుంది. సినిమా చూస్తే కదా కాపీ నా కాదా అర్థమయ్యోది. ఇలా అనవసరంగా ఎందుకు అంత పెద్ద డైరెక్టర్ ఇలాంటి వేస్ట్ కామెంట్స్ చేయడం అంటున్నారు. ఇప్పటికే బన్నీ సినిమా 'ఇంటిగుట్టు' కు ప్రేరణ అని.. 'రౌడీ అల్లుడు' అటో జానీ ఆఫీస్ ఎపిసోడ్స్ డైరెక్ట్ గా దించేశారని ఎన్నో అనుమానాలు ప్రేక్షకుల మనసులో నాటారు. వీటితోనే మన మాటల మాంత్రీకుడికి మైండ్ బ్లాకవుతుంటే ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ వెటకారం ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: