ఏసుదాసు : ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలను పాడి సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు ఏసుదాసు. ఐదు దశాబ్దాలలో ఎన్నో భాషల్లో పాటలు పాడారు. తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ బెంగాలీ ఒరియా భాషలతో పాటు అరబిక్ ఆంగ్లం లాటిన్ రష్యన్ భాషలో కూడా సుమారు 8 వేల పాటలను పాడారు ఏసుదాసు. ఏసుదాసు ను అందరూ గాన గంధర్వన్ అని  పిలుస్తూ ఉంటారు. ఇక ఈయన ఎన్నోసార్లు రికార్డు స్థాయిలో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు. ఉత్తమ గాయకుడిగా ఉత్తమ నేపథ్య సంగీత గాయకుడిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఏకంగా ఐదు సార్లు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు ఏసుదాసు. ఇక భక్తి పాటలు పాడడంలో కూడా ఏసుదాసు తనకు తానే సాటి. ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలు పాడి రికార్డు సృష్టించారు. సినిమాల్లోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు ఏసుదాసు. ఏసుదాసు 1940 జనవరి 10 న  జన్మించారు. 

 

 

 అల్లు అరవింద్ : టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ 1949 జనవరి 10వ తేదీన జన్మించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అరవింద్ ఆ తర్వాత ఎన్నో సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. ప్రస్తుతం హీరోల రేంజ్ లో క్రేజ్ ఉంటుంది అల్లు అరవింద్ కి. తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. అల్లు అరవీంద్  కొడుకు అల్లు అర్జున్ కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు నిర్మాత అల్లు అరవింద్. 

 

 

 హృతిక్ రోషన్ : 1974 జనవరి 10వ తేదీన హృతిక్ రోషన్ జన్మించారు. బాలీవుడ్ స్టార్  హీరోగా  హృతిక్ రోషన్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు హృతిక్ రోషన్. ఇక ఇప్పుడు వరకు ఆరు ఫిలింఫేర్ పురస్కారాలు సైతం అందుకున్నారు. తండ్రి రాకేష్ రోషన్ వారసుడిగా  హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన హృతిక్ రోషన్ ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక హృతిక్ రోషన్ కి  డాన్స్ లో ఎవరూ సాటి లేరు అని చెప్పాలి . ఎన్నో వైవిధ్యత్మకమైన సినిమాల్లో నటించి తన సత్తా చాటారు హృతిక్ రోషన్. ప్రస్తుతం బాలీవుడ్ గ్రీక్ బాడ్ గా  ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు హృతిక్ రోషన్. నటన విషయంలో హృతిక్ రోషన్ కి ఎవరూ సాటి లేరు అనే చెప్పాలి. అద్భుతమైన నటనతో అందరి మన్ననలు పొందుతూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు హృతిక్ రోషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: