చాలా సందర్భాలలో రైతులకు అన్యాయం జరుగుతున్న విషయం తెలిసిందే. భూమినే నమ్ముకున్న అన్నదాత అవసరాలను తీర్చగలిగే రాజకీయ నాయకులు లేకపోవడంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓట్ల సమయంలో తప్ప రైతులు మరెప్పుడు మన రాజకీయ నాయకులకు గుర్తు రారు. ఇది ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు కూడా ఆంధ్రాలో రైతులు ఇబ్బందులకు గురౌతున్నారు. అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

 

రైతులకు మద్దతుగా టీడీపీ, జనసేన, వామపక్షాలు సైతం పోరాటం చేస్తున్నాయి. ఐతే అమరావతి రాజధాని విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు పెద్దగా ఎవరూ స్పందించ లేదు. మొదటిసారి హీరో నారా రోహిత్ ముందుకొచ్చాడు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటంలో తానూ పాలుపంచుకుంటామని ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించాడు. అమరావతి కోసం ఇప్పటికే నారా రోహిత్ పెద్దనాన్న, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు పెద్దనాన బాటలోనే నడవబోతున్నారు రోహిత్.

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను. అంటూ నారా రోహిత్ తెలిపాడు. 

 

ఇక సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుంటే బావుంటుందా అని ఇండస్ట్రీలోని పలువు పెద్దలు ఆలోచన చేస్తున్నారు. కానీ రైతుల గురించి మాత్రం ఆలోచించడం లేదు పట్టించుకోవడం లేదు. వారి రైతులు ఆందోళన కనపడటం లేదు.  సినిమాలలో మాత్రం రైతు లేనిదే రాష్ట్రం లేదని అన్నదాత కన్నీళ్ళు పెడితే అది ఆ రాష్ట్రానికి మంచిది కాదని మన స్టార్ హీరోలు ఉపదేశాలిస్తారు. అది రీల్ లైఫ్. కానీ రియల్ లైఫ్ లో మాత్రం రైతులను పట్టించుకునే అసలైన స్టార్ హీరో ఇంతవరకు ముందుకు రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: