రజనీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమా ఈ రోజు థియేటర్ లో అడుగు పెట్టి సంచలనం సృష్టిస్తోంది.  మొట్టమొదటి రోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఎంతవరకు కలక్ట్  చేస్తుంది అనేది ప్రశ్న ..  దాదాపుగా 120 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంది . .  ఈ సినిమాకి టాక్  పెద్దగా పాజిటివ్గా ఏమీ అనిపించడం లేదు . ఎందుకంటే డైరెక్టర్ మురుగదాస్ సెకండాఫ్లో సినిమాని పూర్తిగా నేరంలో ముంచెత్తాడు,  అవసరం లేనటువంటి సీన్లు అన్ని పెట్టేసి ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసాడు అని చూసినటువంటి ప్రతి ఒక్కరు చెబుతున్నారు .

 

 

రజనీకాంత్ యొక్క స్టామినా చరిష్మా ఇవే ఈ సినిమాని కాపాడాల్సి ఉంది.  అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం, దర్బార్ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది డిస్కషన్ లలో ఉంది. ఒక్క రోజులో ఈ సినిమా ఎంత కలక్ట్ చేస్తుంది చేస్తుంది అనేది  చూస్తే ఫ్యూచర్లో ఈ సినిమా ఎంత మేరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది చెప్పవచ్చు . మొదటి రోజున దర్బార్  ప్రపంచ వ్యాప్తంగా  ఒక 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కనెక్ట్ చేయొచ్చు అంటున్నారు అభిమానులు.  రజనీకాంత్ గత చిత్రం 2.0 కూడా ఇలాగే బాగానే కలెక్ట్ చేసి ఫస్ట్ డే 48 కోట్లు వరల్డ్ వైడ్ షేర్ కొట్టింది .

 

 

 అదే బాటలో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అనే ఫీలింగ్ ఫాన్స్ కి ఉంది..  అయితే పేలవంగా ఉన్నటువంటి సెకండాఫ్ ఈ సినిమాకి అతి పెద్ద తలనొప్పిగా మారింది . ఓన్లీ తెలుగులోనే ఈ సినిమాని 20 కోట్లకు అమ్మారు . అయితే 2.0  అలాగే మిగతా సినిమాలకు సంబంధించినటువంటి హైప్  ఈ చిత్రానికి లేదు , దానికి కారణం కూడా లేకపోలేదు ..  పేట ,  కబాలి ఇలాంటి చిత్రాలతో ఇక్కడ మార్కెట్ ని  రజినీకాంత్ పూర్తిగా దూరం చేసుకున్నారు.  పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఎంత మేరకు ఈ సినిమా ఇక్కడ రాణిస్తుంది అంటే చెప్పలేని పరిస్థితి మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది బ్రేక్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ 52 కోట్లు షేర్ వచ్చింది అంటున్నారు. అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: