టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా యావరేజ్ విజయాన్ని దక్కించుకుంది. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో మెగాస్టార్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇకపోతే దాని తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమాకు సర్వం సిద్ధం అవ్వగా, మరికొద్దిరోజుల్లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, 

 

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేకంగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, సరిలేరు సినిమాను ఇంత భారీ క్యాస్టింగ్ తో కేవలం ఐదు నెలల్లో తెరకెక్కించారంటే నిజంగా ఆశ్చర్యం వేసిందని, అందుకే తనతో సినిమాని తీస్తున్న కొరటాలను తమ సినిమా కూడా 100 రోజుల్లోపే పూర్తి చేయాలని గట్టిగా కోరారు మెగాస్టార్, అయితే ఆయన మాటకు వెంటనే స్పందించిన కొరటాల

 

తప్పకుండా సర్ అంటూ రిప్లై ఇచ్చారు. నిజానికి మెగాస్టార్ ఏదయినా మాటిచ్చారంటే దానికి గట్టిగా కట్టుబడి ఉంటారని, అయితే అతి త్వరలో కొరటాలతో తెరకెక్కబోయే సినిమాలో కూడా భారీ క్యాస్టింగ్ నటిస్తున్నారని, మరి ఆయన చెప్పిన విధంగా ఆ సినిమా 100 రోజుల్లోపు పూర్తి అవుతుందనేది అంత ఈజీ కానప్పటికీ సినిమా యూనిట్ మాత్రం ఆ దిశగా కృషి చేసే అవకాశం కనపడుతున్నట్లు పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మెగాస్టార్ మాట ఎంతవరకు నెగ్గుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: