జనవరి 11న సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక  ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక చిత్ర బంధం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా  ఉంది.మహేష్ బాబు అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఒకరేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలకి కూడా మంచి స్పందన రావడంతో మరోసారి మహేష్ బాబు ఖాతాలో  భారీ హిట్టు చేరడం ఖాయమని అర్థమవుతుంది . అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో మహేష్ బాబు ఓ  మీడియా సంస్థ ఇంటర్వ్యూ హాజరయ్యారు. 

 

 

 సరిలేరు  నీకెవ్వరు చిత్రంలో తాను ఆర్మీ అధికారి పాత్ర పోషించాలని... అందుకే ఫిట్ గా  కనిపించడం కోసం ఏకంగా ఆరు కిలోల బరువు తగ్గాను అంటూ వెల్లడించారు మహేష్ బాబు . పాత్రకి అనుగుణంగా సిద్ధమవడం కోసమే ఆలస్యంగా చిత్రీకరణ మొదలు పెట్టామని తెలిపారు. ఎఫ్ 2 సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథ వినిపించాడని అయితే తనకు వేరే కమిట్మెంట్ ఉండడంతో తర్వాత చేద్దామని అనిల్ రావిపూడి తో చెప్పినట్లు మహేష్ బాబు చెప్పుకొచ్చారు. కానీ ఎఫ్2 సినిమా చూశాక మనసు మార్చుకున్నానని  అనిల్ రావిపూడి  చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఒక్కసారి కథ నచ్చింది అంటే ఓకే చెప్పిన తర్వాత దర్శకుడు ఎలా చెబితే అలా నడుచుకుంటా అని మహేష్ బాబు తెలిపారు. 

 

 

 అప్పటివరకు తాను నేర్చుకున్నది అంత  పక్కన పెట్టి మళ్ళీ స్పెషల్ గా కొత్తగా  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ మహేష్ బాబు తన వర్కింగ్ స్టైల్ గురించి అభిమానులకు తెలిపారు. తన పరిధిలో కొత్తగా ఏం చేయగలను అనే దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచిస్తాను  అంటూ మహేష్ బాబు తెలిపారు. కాగా  ప్రయోగాలు చేయాలనుకోవడం మంచి ఆలోచన...  ఆలోచన బాగానే ఉంటుంది కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాకపోవచ్చు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోలు అంతా ఒక విచిత్రమైన జోన్ లో ఉన్నారని.. ఎలాంటి ప్రయోగాలు చేయలేని స్థితిలో ఉన్నాము అని అనుకోవచ్చు అంటూ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక  నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: