బాలీవుడ్ నుండి వచ్చిన సినిమా టాలీవుడ్ లో రీమేక్ అవడం సూపర్ హిట్టవడం చాలానే చూశాము. అలాగే కోలీవుడ్ నుండి వచ్చిన సినిమాలు కూడా మన దగ్గర బ్లాక్ బస్టర్ అవడం కూడా చాలా చూశాము. ముఖ్యంగా సూపర్ గుడ్ ఫిలింస్ విక్టరీ వెంకటేష్ తో నిర్మించిన చాలా సినిమాలు మన దగ్గర మంచి సక్సస్ ని అందుకున్నాయి. అయితే సాధారణంగా ఏ రీమేక్ సినిమాకైనా ఎక్కువగా ఎదురయ్యో ఇబ్బంది ఒకే ఒక్కటి. ఒరిజినల్ సినిమాలోని ఫీల్-ఎమోషన్ ను రీమేక్ లో చూపించలేకపోవడం. ఆ ఫీల్ క్యారీ అవ్వనప్పుడు రీమేక్ ఆటోమేటిగ్గా ఫెయిల్ అవుతుంది. కొన్ని రీమేక్స్ సక్సెస్ అవ్వడానికి, చాలా రీమేక్స్ ఫెయిల్ అవ్వడానికి ఇదే అసలు కారణం. అయితే ఈ విషయంలో సమంత-శర్వానంద్ ల జాను మాత్రం ఈ గండం నుండి గట్టెక్కేలా కనిపిస్తోంది.

 

96 సినిమా కోలీవుడ్ లో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు  ఎంతోమంది హృదయాల్ని హత్తుకుందని చెప్పాలి. అంతలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు తమిళ తంబీలు. అలాంటి ఎమోషనల్ మూవీని జాను పేరిట తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో క్రియేట్ అయిన మేజిక్ ను టాలీవుడ్ లో కూడా రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే రీసెంట్‌గా పోస్టర్ ని తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. 

 

జానుగా సమంత, రాముగా శర్వానంద్ టీజర్ లో చాలా బాగా నటించారు. టీజర్ చూస్తుంటే '96' తరహాలోనే ఇక్కడ కూడా వీళ్లిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యేలా ఉంది. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష జీవించారు. రీమేక్ కోసం కొన్ని మార్పులు చేశామని దిల్ రాజు చెప్పినప్పటికీ టీజర్ లో మాత్రం అలాంటి మార్పులు కనిపించలేదు. తమిళ వెర్షన్ చూసిన వాళ్లకు ఈ విషయం అర్థమౌతుంది. ఎందుకంటే మక్కికి మక్కీ దింపేసినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. ఈ మధ్య వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు కూడా అలా దింపిన సినిమానే. అయినా హిట్ టాక్ తెచ్చుకుంది.

 

ఏదేమైనా ఇక 96 రీమేక్ ను తమిళ సినిమా తీసిన దర్శకుడే తెలుగు వెర్షన్ కు కూడా వర్క్ చేస్తుండడంతో 96 ఫ్యాన్స్ ను జాను డిసప్పాయింట్ చేయదనే అనుకుంటున్నారు. ఇక ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అయితే సమంత మాత్రం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిందట. అంతగా సినిమా నచ్చే దిల్ రాజు అడగానే వెంటనే ఒప్పేసుకుంది. ఇక త్రిషకి ఈ సినిమా కం బ్యాక్ మూవీ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈ సినిమా హిట్టైనా ఫ్లాపైనా బాధ పడేది మాత్రం సమంతనే. ఎందుకో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: