నయనతార లేడీ సూపర్ స్టార్.. ఎందుకో మళ్ళి.. పెళ్లి కలిసిరాలేదో.. ప్రేమ కలిసి రాలేదో.. ముచ్చటగా మూడోసారి బ్రేకప్ అయ్యింది అని మొన్న ఈ మధ్యే గుస గుసలు వినిపించాయి. అయితే ఆ గుస గుసలలో ఏ మాత్రం నిజం లేదు అని నయనతార కూడా తేల్చేసింది. కానీ ఆమె తేల్చింది నిజం కాదట.. వాళ్ళు చెప్పిందే నిజమట.. బయటకు ఆలా చెప్పిందట. 

 

అసలు వివరాల్లోకి వెళ్తే .. సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయింది. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు అంటూ తిరిగిన నయనతార ఇటీవలే ఓ తమిళ్ దర్శకుడితో ప్రేమలో పడింది. అలా పడిన ఈ జంట పావురాళ్ళ ఆలా ఆలా సమయం దొరికిన అప్పుడల్లా విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తుంటారు.  

 

అయితే వారి ప్రేమను చూసి తట్టుకోలేని వారెవరో వాళ్ళు విడిపోయారని.. మొన్న ఈమధ్య సోషల్ మీడియాలో వార్తలు భారీగా వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అటు నయనతార.. ఇటు విగ్నేష్ ఇద్దరు ఘాటుగా సమాధానం చెప్పారు. కానీ కొన్ని పత్రికలు మాత్రం నయనతార.. విగ్నేష్ చెప్పిన మాటలనే కొట్టి పారేస్తున్నారు. 

 

అదేంటంటే..నయనతార, విగ్నేష్ అబద్దం చెప్తున్నారు అని.. మూడోసారి బ్రేకప్ అయినట్టు తెలిస్తే ప్రజలు ఛీ అంటారు అని ఆలా కవర్ చేస్తున్నారు అని వాళ్ళ మాటలనే తిప్పి కొడుతున్నాయి కొన్ని పత్రికలూ.. ఇలా నయనతారపై దృష్ప్రచారం చేస్తే పాపం నయనతార ఎలా భరించగలదు.. ఆమె ఆనందంగా ఉందటం ఎందుకు ఆ పత్రిక వాళ్లకు అంత ఇష్టమో ఏమో.. పాపం. 

 

అమ్మ నయనతార.. నువ్వు అయినా కాస్త ఆలా ఆలా విగ్నేష్ తో మరోసారి బయటకు వెళ్లిరా అమ్మ.. ఇలా అయితే ఎలా చెప్పు.. త్వరగా పెళ్లి చేసుకొని ఈ పిచ్చి వార్తలకు చెక్ పెట్టు అమ్మ నయనతార అమ్మ.  

మరింత సమాచారం తెలుసుకోండి: