పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల సమయంలో ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ వార్తలు విపరీతంగా వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’ కి ప్రేరణ ఈ సినిమా అంటూ చాలామంది మాటల దాడి మొదలు పెట్టడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరుకున పడ్డాడు. ఆతరువాత ఈవిషయాలు తెలుసుకున్న ‘లార్గో వించ్’ డైరెక్టర్ జెరోమ్ సాలె త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు ఇచ్చాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి. అయితే ఆతరువాత ఆవివాదాన్ని త్రివిక్రమ్ తెలివిగా సద్దుబాటు చేసుకున్నాడు అంటూ అప్పట్లో గాసిప్పులు కూడ వచ్చాయి. 

ఇది ఇలా ఉంటే ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ టైమ్ లో మళ్ళీ ఈ డైరెక్టర్ మళ్ళీ వార్తలలోకి రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఒక నెటిజన్ జెరోమ్ సాలె తో "మీ లార్గో వించ్ కు మరో వెర్షన్ ఈ వారంలోనే వస్తోంది #అల వైకుంఠపురములో" అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన జెరోమ్ "అద్బుతం. లార్గో కు బెస్ట్ ఫ్రీమేక్ అంటూ ఒక అవార్డు ఏర్పాటు చేద్దాం" అంటూ జవాబిచ్చి షాక్ ఇచ్చాడు. 

దీనితో ‘అల వైకుంఠపురములో’ కు ‘లార్గో వించ్’ కు సంబంధం ఏమిటో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. వాస్తవానికి 'అల వైకుంఠపురములో' ప్రోమోస్ లో ఆవిధంగా ప్రశ్నించిన వ్యక్తి ఏమి పసిగట్టాడో తెలియకపోయినా ఇప్పుడు ఆవ్యక్తి పనికట్టుకుని ‘లార్గో వించ్’ డైరెక్టర్ ను ఎందుకు కెలికాడు అంటూ చాలమంది ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి ప్రభాస్ ‘సాహో’ విడుదల సమయంలో కూడ ఆ సినిమా ‘లార్గో వించ్’ కు కాపీ అంటూ వార్తలు వచ్చాయి. 

అయితే ‘లార్గో వించ్’ ప్రేరణతో వచ్చిన సినిమాలు అన్నీ తెలుగులో భయంకరమైన ఫ్లాపులుగా మారాయి. దీనితో అలాంటి సాహసం మళ్ళీ త్రివిక్రమ్ చేయడు అని అనిపించడం సహజం. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్మూవీ ఒకనాటి సీనియర్ ఎన్టీఆర్ 'ఇంటిగుట్టు' కు ప్రేరణ అని చిరంజీవి 'రౌడీ అల్లుడు' అటో జానీ ఆఫీస్ ఎపిసోడ్స్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ దించేశాడని ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ ‘అల వైకుంఠపురములో’ మ్యానియా మధ్య ఇలా ‘లార్గో వించ్’ డైరెక్టర్ కామెంట్స్ చేయడం అత్యంత సంచలనంగా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: