మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా రేపటి రోజున థియేటర్లో సందడి చేయబోతున్నది.  ఈ సినిమా రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  మొదటి రోజే వీలైనంతగా సంపాదించాలని చూస్తున్నారు.  ఎందుకంటే ఆ మరుసటి రోజునే థియేటర్లోకి బన్నీ అల వైకుంఠపురంలో కూడా రిలీజ్ కాబోతున్నది.  అందుకే మొదటి రోజే కావలసినన్ని డబ్బులు వచ్చేలా చూసుకుంటున్నారు. అయితే, అభిమానుల్లో మాత్రం తీవ్రమైన టెన్షన్ నెలకొని ఉన్నది.  


అదేమంటే వరసగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి.  మూడో సినిమా ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.  కామెడీ వర్కౌట్ అయ్యి సినిమాకు మంచి నేమ్ వస్తే పర్వాలేదు.  ఏదైనా తేడా కొడితే బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.  అదే అభిమానుల టెన్షన్.  ఎందుకంటే బన్నీ కంటే ముందుగా వస్తున్నాడు కాబట్టి ఈ టెన్షన్ ఉంటుంది.  అటు బన్నీ అభిమానులకు కూడా ఇదే టెన్షన్ ఉన్నది.  


ఈ రెండు సినిమాలు బాగున్నాయి అంటే పండగకు మంచి కళ వచ్చినట్టే.  లేదు తేడా కొట్టింది అంటే మాత్రం నిన్న రిలీజైన దర్బార్ డబ్బులు పోసుకుంటుంది.  అందుకే సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.  సినిమాలను హిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.  కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది.  ఒకవేళ కంటెంట్ బాగున్నా ప్రేక్షకులకు నచ్చని లేదు కదా.  


నచ్చితే మంచిదే.. నచ్చకుంటే ఎవరు ఎన్ని చెప్పినా జరగని పని అవుతుంది.  కాబట్టి ఎవరూ కూడా  ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు అన్నది వాస్తవం.  టెన్షన్ పడకుండా ఉండి, ఎలా సినిమాను హిట్ చేసుకోవాలో అలా చేసుకుంటే చాలు.  పండగ కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి.  మహేష్ బాబు స్క్రిప్ట్ మొత్తం నచ్చితేనే సినిమా చేస్తున్నారు.  అప్పటి నుంచి మొత్తం మారిపోయింది.  ఈ సినిమాకు కూడా అలానే చేశారు.  మరి ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: