జబర్దస్త్ కామెడీ షో అనగానే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే మంచి కామెడీ షో అనే టాక్ వినిపిస్తుంది. నిజంగా ఇది నిజమే అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎటువంటి బాధలో ఉన్న కాసేపు ఈ షో ను చూస్తే ఆ బాధ మటుమాయం అయ్యి ముఖంలో నవ్వులు పూయిస్తుంది. ఇకపోతే ఈ షో ద్వారా అప్పటి వరకు అనామకుల్లా ఉన్న ఎందరో నటులు, వెలుగులోకి వచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మగవారైతే లేడి గెటప్ వేసుకుని, ఆడవారి అందానికే పోటిగా నిలిచారు. వారు వేసుకున్న ఆడవారి వేషం చూస్తే, వారిని మగవారు అంటే ఎవరు నమ్మరు. అంతలా ఇమిడిపోయారు.

 

 

ఇకపోతే జబర్దస్త్ కామెడీ షో లో లేడి గెటప్ వేసుకునే సాయితేజ అందరికి గుర్తుండే ఉంటాడు. లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయినా ఈ అబ్బాయి, ఆ తర్వాత ఏకంగా నిజమైన అమ్మాయిగానే మారిపోయాడు. అదెలాగంటే ఆపరేషన్ చేయించుకుని సాయితేజ కాస్తా ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు. ఇక సమాజం ఎలా ఉందంటే కామం శరీరంలో పుట్టగా హిజ్రాలను కూడా వదలడం లేదు.

 

 

హిజ్రాలేం ఖర్మ పశువులను కూడ వదలడం లేదు. ఇలాంటి సంఘటనే ప్రియాంకగా చెప్పబడే, సాయితేజ విషయంలో జరిగిందట. అదేమంటే తాను సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని గుర్తు చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ మధ్యే జరిగిన ఓ సంఘటనను బయటపెట్టింది. ఓ దర్శకుడు తనకు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని..

 

 

తాను కూడా చేస్తానని చెప్పగా. అయితే ఆ పాటలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా పెద్ద హీరోయిన్లే చేస్తున్నపుడు తానెందుకు చేయనని చెప్పిందట. ఇక ఆ ప్రాజెక్ట్ ఒకే అయ్యి షూట్ కోసం బయల్దేరుతున్న సమయంలో అదే దర్శకుడు కాల్ చేసి తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది ప్రియాంక. ఇవన్ని ఆరోపణలు చేసిన ఈ జబర్దస్త్ నటి తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: