కేవలం ఒకరోజు తేడాతో మహేష్ బన్నీ సినిమాలు విడుదలవుతున్న పరిస్థితులలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ మాత్రమే కాకుండా ఈ రెండు సినిమాల ప్రమోషన్ కూడ నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల నిర్మాతలు ఈ సినిమాల ప్రమోషన్ పై అత్యంత భారీగా ఖర్చు పెడుతున్నా పబ్లిసిటీ మెటీరియల్ దగ్గర నుండి ప్రమోషన్ వ్యూహాల వరకు ‘సరిలేరు’ టీమ్ ముందు ‘అల’ టీమ్ వెనకపడింది అన్నవార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలో కూడ మహేష్ స్పీడ్ ముందు బన్నీ నిలవలేక పోతున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ రకరకాల కాంబినేషన్లలో ఇంటర్వ్యూలు చేయించి ప్రజలలో క్రేజ్ ను తీసుకు వస్తున్నారు. ఈ విషయంలో బన్నీ పూర్తిగా విఫలం అయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నేషనల్ మీడియా కూడ ‘సరిలేరు నీకేవ్వరుకు’ ఇస్తున్న ప్రాముఖ్యత ‘అల వైకుంఠపురములో’ కు ఇవ్వడం లేదు. దీనితో ప్రస్తుతానికి పబ్లిసిటీ వ్యూహాలలో మహేష్ ది పై చేయిగా కనిపిస్తోంది. అయితే ఈ పబ్లిసిటీ వ్యూహాలు అన్నీ కేవలం ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో సహకరిస్తాయి కాని అంతిమంగా సగటు ప్రేక్షకుడు ఇచ్చే తీర్పును ఈ పబ్లిసిటీ వ్యూహాలు ప్రభావితం చేయలేవు. 

ముఖ్యంగా ఈ రెండు సినిమాలకు కలక్షన్స్ పరంగా బిసి సెంటర్లలో మంచి టాక్ రావాలి అప్పుడు మాత్రమే ఈ మూవీ బయ్యర్లు లాభ పడతారు. సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా ఆ సినిమా బాగుండకపోతే ప్రేక్షకులు రిపీట్ కారు. అయినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ లో ఒక మూవీ ప్రమోషన్ అత్యంత కీలకంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులలో దూసుకు పోతున్న మహేష్ ను నిర్లక్ష్యం చేయకుండా కట్టడి చేయాలి అంటూ బన్నీకి అతడి సన్నిహిత మీడియా వర్గాలు వేకప్ కాల్స్ ఇస్తున్నట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: