రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి లాంటి విజయం తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి లాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతోంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, మళయాలం, కన్నడ సహా ఇంకా ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారట.

 


ఈ సినిమాలో ఎన్టిఆర్ కొమరం భీం గా కనిపించనున్న విషయం తెలిసిందే. నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరుడు కొమరం భీం పాత్రలో ఎన్టిఆర్ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎదురు చుస్తున్నారు. అయితే ఈ లుక్ గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో అభిమానులే తమ అభిమాన హీరో కొమరం భీం గా ఎలా ఉంటాడో ఊహించి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టిఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపించనుంది. 

 

అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా ఓ కమెడియన్ నటించబొతున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామక్రిష్ణ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా కనిపించనున్నాడట. త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ అంటే.. మనోడికి మంచి క్యారెక్టరే. పైగా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తాడట.

 

ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: