మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. సుకుమార్ కూడా మహేష్ కోసం కథని సిద్ధం చేశాడు కూడా. ఆ కథ మీద కొంతకాలం పాటు వర్క్ కూడా జరిగింది.  వన్ నేనొక్కడినే లాంటి ఫ్లాప్ ఇచ్చాక మహేష్ బాబు కోసం మంచి హిట్ సినిమా తీస్తానని సుకుమార్ చెప్పాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా క్యాన్సిల్ అయింది. అనూహ్యంగా అనిల్ రావిపూడితో సినిమా పట్టాల మీదికెక్కింది.

 

దీంతో మహేష్ సుకుమార్ ల కాంబినేషన్లో సినిమా వస్తుందని అనుకున్న వారికి నిరాశే ఎదురయింది. సుకుమార్ ఎంత మంచి డైరెక్టరో అందరికీ తెలిసిందే. అదీ గాక అప్పటికే రంగస్థలం లాంటి నాన్ బాహుబలి రికార్డుని సొంతం చేసుకున్న రికార్డు కూడా ఉంది. మరి అలాంటి డైరెక్టర్ ని కాదని మహేష్ అనిల్ రావిపూడి లాంటి మాస్ సినిమా డైరెక్టర్ తో సినిమా చేయడం ఏంటని అందరూ ప్రశ్నించారు. అయితే వారి మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.

 

ఇకపోతే తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో మాట్లాడుతూ ‘సరిలేరు..’ చేయాలనుకోవడం తన కెరీర్లోనే బెస్ట్ డెసిషన్ అని మహేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. పరోక్షంగా సుక్కు చిత్రాన్ని వదులుకోవడం తప్పేమీ కాదని మహేష్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లే ఉంది.  ఈ విషయంలో సుకుమార్ ఏం అంటాడో తెలియాలి. మరి మహేష్ చెప్పినట్టు సుకుమార్ సినిమాని వదులుకుని మంచిపనే చేశాడా లేదా తెలియాలంటే సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అవ్వాలి.

 

అలాగే మహేష్ రిజెక్ట్ చేసిన కథని అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న సుకుమార్ సినిమా కూడా విడుదల కావాలి. అప్పుడు కానీ ఈ రెండు కథలు ఎలాంటివో చెప్పలేం. ఒక్కటి మాత్రం నిజం. సుకుమార్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేసుంటే మరోలా ఉండేదేమో. ఎందుకంటే రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ ని ఎప్పటికీ మరువలేం... అయినా ఎవరి నిర్ణయం వారిది.

మరింత సమాచారం తెలుసుకోండి: