సూపర్ హిట్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు అన్నీ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించాయి. ఇక ట్రైలర్ కు  కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ  హిట్ కాంబినేషన్ కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు అభిమానులు . కాగా జనవరి 12 ఎప్పుడొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇకపోతే సంక్రాంతి వచ్చిందంటే ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సొంత ఊళ్లకు చేరుకుంటారు... అంతేకాకుండా కొత్త అల్లుళ్ళు అందరూ అత్తారింటికి చేరుకొని సంక్రాంతి పండుగను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 

 

 

 మరి విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఎలా ఎంజాయ్ చేస్తారో తెలుసా... సంక్రాంతి సందర్భంగా విడుదలైన తమ అభిమాన హీరోల సినిమాలు చూసి సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ సంక్రాంతికి ఎక్కువగానే సినిమాలు విడుదల అవుతుండటంతో... ఇక ప్రేక్షకులకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గదు అనే చెప్పాలి. సాంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి ఒకటైతే.. సినిమాలు చూసి ఎంటర్టైన్ అయ్యి  జరుపుకునే సంక్రాంతి మరొకటి అని తెలుస్తోంది. కాగా ఈ సంక్రాంతి సీజన్ కు చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురములో సినిమా అమెరికాలో పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేందుకు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 

 

 

 టికెట్ ధరలపై అద్భుత ఆఫర్లు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు  అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్లు. రీగల్  సినిమాస్ తాము అందించే రీగల్ అన్లిమిటెడ్ పాస్ కొనుగోలు చేసిన వారికి అలా వైకుంఠపురములో  సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. కొన్ని చోట్ల రెండు డాలర్ల కి టికెట్లు అమ్ముతోంది రీగల్  సినిమాస్ . ఏఎంసి సంస్థ తమ స్టబ్స్  ఏ-లిస్ట్  చందాదారులకు కూడా ఉచితంగా టిక్కెట్లను అందిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మామూలుగా అయితే టికెట్ ధర 14 డాలర్ల వరకు ఉండగా.. సిని మార్క్ సినిమాస్,  మూవీ క్లబ్ పాస్ ఉన్నవారికి ధరలు ఐదు డాలర్లు డిస్కౌంట్ ప్రకటించింది. ఆటమ్స్ టికెట్స్ కంపెనీ తమ వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసి ఛేజ్ పే ద్వారా చెల్లింపులు జరిపితే $7 డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: