ప్రముఖ దర్శకులు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘దర్బార్‌’కు మిశ్రమ స్పందన వచ్చింది.  కాకపోతే తమిళ నాట రజినీ మానియాతో మొదటి రోజు కలెక్షన్లు నాట్ బ్యాడ్ అనిపించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోమాత్రం ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేకపోయింది.  రజినీ ఎప్పటికీ అదే తరహా మూస పద్దతిలో రోటీన్ డైలాగ్స్ తో అలరిస్తున్నారని.. ఈ తరహా యాక్షన్ ప్రేక్షకులు చూడలేక పోతున్నారని విమర్శలు వచ్చాయి.  ఈ సంక్రాంతికి దర్భార్, సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురముంలో, ఎంత మంచివాడవురా మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే.  

 

ఇక దర్భార్ పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవడం.. ఇప్పుడు అంతా మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో, కళ్యాన్ రామ్ ఎంత మంచివాడవురా రిజల్ట్ ఎలా ఉండబోతుందా అని చూస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ మద్య టెక్నాలజీ పుణ్యమా అని చిన్నా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్లో బొమ్మ పడ్డ కొద్ది గంటల్లోనే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎన్ని భద్రతలు తీసుకున్నా పైరసీని మాత్రం అరికట్టలేక పోతున్నారు.  భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘దర్బార్‌’కు ‘తమిళ రాకర్స్’ షాకిచ్చారు.  తమిళ నాట ఏ సినిమా వచ్చినా.. తమిళ రాకర్స్ కొద్ది గంటల్లోనే పైరసీ చేసి సీడీల రూపంలో అమ్మేస్తున్నారు.

 

 నిన్న దర్బార్ మూవీ విడుదల కాగానే పైరసీ చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేసే ‘తమిళ రాకర్స్’ సినిమా విడుదలై తొలి ఆట పూర్తి కాగానే పైరసీ చేసేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. సాధారణంగా ఏ భాషలో విడుదలైన సినిమా అయినా వదిలిపెట్టని వీరు.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘దర్బార్’ను కూడా విడిచిపెట్టలేదు. పైరసీ చేయడంలో సిద్ధహస్తులైన తమిళ రాకర్స్.. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లో వచ్చే సినిమాలు గంటల్లోనే కాపి చేసి వ్యాపారం చేస్తున్నారు. మరోవైను కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే ఇలా పైరసీ తో పెద్ద దెబ్బ వేస్తున్నారని బాధపడుతున్నారు సినీ నిర్మాతలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: