ఈ సంక్రాంతికి తెలుగులో గట్టి పోటీ నెలకొంది. రెండు పెద్ద సినిమాలతో పాటు ఒక చిన్న చిత్రం కూడా విడుదల అవుతోంది. ఈ రకంగా రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి పోటీ పడటం చాలా రోజుల తర్వాత ఇదే మొదటి సారి. గత ఏడాది కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఇద్దరు స్టార్ల సినిమాలు.. అది కూడా సమ ఉజ్జీలుగా ఉన్న స్టార్ల సినిమాలు విడుదల అవడం మాత్రం చాలా రోజుల తర్వాతే...

 

అయితే ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో స్నేహపూర్వకమైనా వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడా కూడా పోటీతత్వం లేకుండా ప్రశాంతంగా ఉంది. అభిమానుల్లో తమ అభిమాన హీరో సినిమా ఆడాలని, మరో హీరోతో కంపేర్ చేస్తున్నప్పటికీ మన హీరోల్లో మాత్రం అది కనిపించట్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమతో పాటు రిలీజ్ అవుతున్న సినిమాల గురించి మాట్లాడుతూ, ఆ సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకోవడమ్ నిజంగా మంచి పరిణామం.

 

అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు గురించి మాట్లాడాడు.. అలాగే కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా గురించి మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పాడు. కళ్యాణ్ రామ్ కూడా సినిమా పేర్లు చెప్పి మరీ వారికి బెస్ట్ విషెస్ తెలియజేశాడు. కానీ మహేష్ బాబు మాత్రం అలా చేయలేదు.  

 

సంక్రాంతికి పోటీగా రాబోతున్న ఇతర సినిమాలపై మీ స్పందన ఏంటీ అంటూ మీడియా ప్రశ్నించగా మహేష్ బాబు మాట్లాడుతూ.. సంక్రాంతి పోటీ లేకుండా గ్యాప్ తో సినిమాలు విడుదల అయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు. సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ.. ఈ సీజన్ సినిమాలకు చాలా మంచిది. ఫలానా అని సినిమా పేరు చెప్పకుండా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా తప్పకుండా అన్నింటికి న్యాయం జరుగుతుంది అన్నాడు. మరి మహేష్ బాబు ఇలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటో....?

మరింత సమాచారం తెలుసుకోండి: