మామూలుగా ముద్దు అనేది.. అవతలి వాళ్ళు ముద్దొస్తెనో లేక ప్రేమికుల మద్య చిన్న కెమిస్ట్రీ వళ్లనో ముద్దులు లేదా ముద్దొచ్చే సీన్లు జరుగుతున్నాయి.. ఇకపోతే ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా ముద్దు మురిపాలు లేకుండా మాత్రం అటు అసలు సినిమాలో ఏ ఇండస్ట్రీలో కూడా బూతద్దం లేకండా వెతికినా కూడా దొరకవు అని అనడంలో సందేహం లేదు..

 

వివరాల్లోకి వెళితే .చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు.. 60 ఏళ్ల వయసులో ముద్దు సీన్ల కోసం తెగ ఆరాటపడుతున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మలంగ్’. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో ఆదిత్య, దిశల మధ్య గాఢమైన ప్రేమను చూపించడానికి తెగ కిస్సింగ్ సీన్లను జొప్పించేశారు. దీని గురించి ఓ విలేకరి అనిల్ కపూర్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘మీతో పాటు నటించిన ఆదిత్య, దిశల మధ్య కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి కదా. మీకు ఆ ఛాన్స్ లేదని బాధపడుతున్నారా?’ అని అడిగారు.

 

ఈ ప్రశ్నకు అనిల్ కపూర్ ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు.. సరే నిజం చెప్పాలంటే నాకు ఇటువంటి సీన్లలో నటించ లెకపొయాను అని చాలా ఫీల్ అయ్యాను. నేను కుర్రాడిని అయి ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాను అని అన్నారు. సినిమాలో ఆదిత్య, దిశ బైక్ రైడ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా కుర్రాడిని అయివుంటే వారిలాగే నేనూ ఎంజాయ్ చేసేవాడిని’ అని తెలిపారు. ఇందులో అనిల్ కపూర్ పోలీసుగా విలన్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

 

ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే  ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీల అండర్ వాటర్ కిస్సింగ్ సీన్ హైలైట్‌గా నిలవనుందట. ఇందుకోసం హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇచ్చారు. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. అంతసేపు అండర్‌ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్‌ కెపాసిటీని పెంచేందుకు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు.. అదే ఈ సినిమాకు ప్లస్ అయింది అని ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: