సంక్రాంతి  రేస్ రిజల్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు మహేష్ బన్నీలు చాల ఆసక్తిగా ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ వెంకటేష్ లకు ఈ నెల 20వ తేదీ కీలకంగా మారడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ విక్టరీ వెంకటేష్ ఇలా ముగ్గురు తమ సినిమాలకు సంబంధించి జనవరి 20 తారీఖును మంచి రోజుగా ఎంచుకోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

తెలుస్తున్న సమాచారంమేరకు జనవరి 20న వేర్వేరు లొకేషన్లలో ఈ ముగ్గురు అగ్రహీరోల చిత్రాలు ప్రారంభం కానున్నాయి అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్ వెంకటేష్ ‘అసురన్’  తెలుగు రీమేక్ ప్రభాస్ ఇప్పటికే మొదలు పెట్టి ఆపేసిన జిల్ రాథా కృష్ణ మూవీల షూటింగ్ లు ఒకేరోజున ప్రారంభం కాబోతున్నాయి అని తెలుస్తోంది. 

పవన్ ప్రభాస్ సినిమాలు హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంటే వెంకటేష్  సినిమా మాత్రం అనంతపురం లో ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ‘సాహో’ నిరాశ నుండి తేరుకున్న ప్రభాస్ ఎన్నికల ఘోర పరాజయం షాక్ నుండి బయటపడ్డ పవన్ లు తిరిగి మేకప్ వేసుకుని ఒకే రోజు కెమెరా ముందుకు రావడం ఒక విధంగా అనుకోని సంఘటన. 

అయితే  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రగిలిపోతున్న రాజధాని రగడలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడ జరగబోతున్న పరిస్థితులలో పవన్ లేకుండానే ‘పింక్’ రీమేక్ షూటింగ్ ను మొదలు పెట్టి ఆ తరువాత మాత్రమే పవన్ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొందరు అంటున్నారు. మరికొందరైతే పవన్ కళ్యాణ్ జనవరి 20 ఒక్కరోజు తన మిడిల్ ఏజ్ లాయర్ గెటప్ లో వచ్చి ఆ తరువాత మళ్ళీ తన రాజకీయ కార్యక్రమాలలో బిజీ అవుతూ మధ్యమధ్యలో వచ్చే గ్యాప్ లో ‘పింక్’ రీమేక్ పూర్తి చేస్తాడు అన్న వాదన కూడ వినిపిస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: