భారతదేశపు తొలి ఫ్రీడం ఫైటర్ కథగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రతిష్టాత్మక సినిమా సైరా.. నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గతేడాది అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విడుదలైన సైరా.. నిన్నటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులోని మినీ శ్రీనివాస ధియేటర్లో డైరెక్ట్ 4షోస్ తో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. దీంతో స్పెషల్ కేక్ కోసి డిస్ట్రిబ్యూటర్, ధియేటర్ యాజమాన్యం సమక్షంలో ఈ వంద రోజుల వేడుక జరుపుకున్నారు ఫ్యాన్స్. ఇందుకోసం మెగా ఫ్యాన్స్ స్పెషల్ షీల్డ్ చేయించి ధియేటర్, డిస్ట్రిబ్యూటర్ కు అందజేశారు.

 

 

సినిమాలో మెగాస్టార్ నటనకు, మేకింగ్ కు సర్వత్రా ప్రశంసలు లభించాయి. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించాడు. మెగాస్టార్ జోరుతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. శతదినోత్సవాలు కరువైపోయిన ఈ రోజుల్లో సైరా.. ఆ మార్కు చేరుకోవడం విశేషం. ‘ఖైదీ నెంబర్ 150, సైరా..’ ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల షేర్ మార్క్ దాటి సినిమాల్లో మెగాస్టార్ స్టామినా స్థాయి ఏంటో మరోసారి తెలియజేసాయి. సైరా.. తెలుగు వెర్షన్ లోనే 100కోట్లు కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైనా తెలుగు, కర్ణాటక మినహా మిగిలిన ఏరియాల్లో పెద్దగా ఆడలేదు.

 

 

ఓ ఫ్లాప్ వస్తే మళ్లీ సినిమా చేయడానికి జంకే రోజులు ఇవి. ఎలాంటి సినిమాలు చేయాలంటూ హీరో లెక్కలు మార్చేస్తూంటుంది. కానీ.. సినిమాలకు తొమ్మిదేళ్ల పాటు దూరంగా ఉండి బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ తన పాత జోరునే చూపిస్తూ ఈ జనరేషన్ హీరోలకు పోటీనిస్తూండటం గొప్ప విషయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: