బాలీవుడ్, టాలీవుడ్. కోలీవుడ్, సాండిల్ వుడ్ ఇలా ఏ ఉడ్డులోనైనా హీరో హీరోయిన్స్ ప్రేమించుకోవడం, డేటింగ్ అంటూ ఎంజాయ్ చేయడం కొంతకాలానికి పెళ్ళి చేసుకోవడం లేదా బోర్ కొట్టి విడిపోవడం సర్వ సాధారణం. కానీ మనం మాత్రం దీని గురుంచి ఆసక్తికరంగా చెప్పుకుంటాము. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం హీరోని కాకుండా సహాయా దర్శకుడినో లేదా మేకప్ మేన్ నో లవ్ చేసి పెళ్ళి చేసేసుకుంటుంటారు. అందుకు ఉదాహరణగా అలనాటి హీరోయిన్ రాశి. ఆవిడ కూడా ఎంత మంది పాపులర్ హీరోలు ఉన్నప్పటికి ఒక సాధారణమైన అసోసియోట్ డైరెక్టర్ ని పెళ్ళి చేసుకుంది. 

 

ఇది అప్పట్లో కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే మరోటి జరిగింది. నిర్మాత నుంచి డబ్బు వసూలు చేసి పరారైన కేసులో తుంగభ్రద హీరోయిన్ విజయలక్ష్మి కోసం పోలీసులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. మోసం చేసి సొమ్ములతో ఉండాయించిదనేది ప్రధాన ఆరోపణ. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విజయలక్ష్మి కోసం గాలించారు. తాజాగా ఆ మిస్టరీ వీడింది. విజయలక్ష్మి కర్ణాటక రాయచూర్ లో ప్రత్యక్షమైంది. భర్త అంజనేయ తో సహా పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి విజయలక్ష్మి నేరుగ వివాదంపై వివరణ ఇచ్చింది. 

 

తుంగభద్ర సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ సినిమా సహాయ దర్శకుడు అజినేయను ప్రేమించానని... అతను గంగావతిలో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. దీంతో ఇంట్లో తన తల్లికి మిగతా కుటుంబ సభ్యులకి నచ్చక పోవడంతో ఆత్మహత్యాయత్నం చేసారని ప్రచారమైంది. ఇదంతా డబ్బుల కోసం ఆడుతున్న పెద్ద డ్రామా అని విజయలక్ష్మి ఆరోపించింది. తన తల్లిదండ్రులు విడిపోయి చాలా కాలమవుతోందని...తన తల్లి సహా పెంచిన తండ్రి బాధలు పెడుతున్నారని వాపోయింది. తను భర్తను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అంతేకాదు ఇంటి నుంచి గానీ..ఏ నిర్మాత నుంచి గానీ డబ్బు తీసుకోలేదని తెలిపింది.

 

ఇంట్లో పెద్దాళ్లకు డబ్బు సంపాదించడమే ముఖ్యం. తాను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకునే వారు కాదని ఆవేదన చెందింది. అందుకే ఈ విషయాన్ని ముందే చెప్పలేదని ఒకవేళ చెబితే తన వాళ్ళే కంపు చేసి నా జీవితం నాశనం చేసేవారని వాపోయింది. అందుకే జిల్లా ఎస్పీ ని తమకు రక్షణ కల్పించాల్సింది గా కోరింది. దీంతో హీరోయిన్ మిస్టరీ ఓ కొలిక్కి వచ్చింది. విజయ లక్ష్మి వ్యాఖ్యల నేపథ్యంలో కేసు కొత్త కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అలాగే రహాస్యంగా విజయలక్ష్మి పెళ్లి చేసుకున్నట్లు ఈ ఘటనతో వెలుగులో వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: