సినిమాల్లో, రాజకీయాల్లో వారసత్వం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సీనియర్ హీరోలు, రాజకీయ నాయకులు తాము రాణించిన రంగాల్లో తమ వారసులు కూడా రాణించాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా సినిమా రంగంలో వారసులు తమ హవా చూపిస్తున్నారు. హీరోల కుమారులు, హీరోయిన్ల కుమార్తెలు సినిమాల్లో తెరంగేట్రం చేస్తూ తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కుమార్తె తెలుగు సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతోంది.

 

 

యాక్షన్ కింగ్ గా ఎనభైవ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటిన అర్జున్ కుమార్తె ఐశ్వర్య తెలుగు సినిమాల్లో నటించేందుకు సమయాత్తమవుతోంది. అర్జున్ కు హీరోగా, దర్శకుడిగా కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో తన కుమార్తెను సినీ రంగానికి పరిచయం చేశాడు. ఇప్పటికే ఐశ్వర్య తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు తెలుగులో కూడా తన లక్ ట్రై చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇందుకు బ్యాక్ గ్రౌండ్ లో అర్జున్ తన ప్రయత్నాలు ప్రారంభించాడని టాక్. ఇందుకు పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఐశ్వర్య ఇప్పటికే ఐదారు సినిమాలు చేసింది.

 

 

సక్సెస్ శాతం ఎంతనేది పక్కన పెడితే తెలుగులో కూడా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది ఐశ్వర్య. స్టార్ హీరోల కుమార్తెలు ఇప్పటికే చాలామంది సినీ రంగంలో వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. రజినీ కుమార్తె దర్శకురాలైంది. శరత్ కుమార్ కుమార్తె కూడా నటిస్తోంది. మోహన్ బాబు, నాగబాబు, రాజశేఖర్ కుమార్తెలు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. సాధారణంగా హీరోల కుమారులే సినిమాల్లో నటిస్తూంటారు. కానీ.. ఇప్పుడు వారి కుమార్తెలు కూడా నటనలోకి వస్తున్నారు. మరి ఐశ్వర్య తెలుగులో ఏమేరకు రాణిస్తుందో తొలి సినిమా వచ్చాకే తెలిసేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: