అల్లు శిరీష్ మెగా కాపౌండ్ కు చెందిన హీరోలలో ఒకరు. ఇతను హీరోగా 2013 లో వచ్చిన గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఇక గత ఏడాది ఏ బి సి డి అనే ఓ యూత్ ఫుల్ స్టోరీ తో ముందుకు వచ్చాడు. కాని ఇతను నటించిన సినిమాలు అంతగా సక్సెస్‌ను సాధించలేదని చెప్పవచ్చూ.

 

 

అల్లు అరవింద్ గారి చిన్నబ్బాయిగా సిని రంగప్రవేశం చేసిన అల్లు శిరీష్ ఖాతాలో ఇప్పటివరకు చేసినవి ఐదు సినిమాలే, కాని ఈ చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. ఇకపోతే హీరో అల్లు శిరీష్ ఓ పక్క హీరోగా నటిస్తూనే ఇలా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నారు. కాగా అల్లు శిరీష్ నటించిన మలయాళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఏ బి సి డి. చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం అల్లు శిరీష్ త్వరలో నటించనున్న చిత్రాలు చర్చల దశలో ఉండగా వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చు..

 

 

ఇకపోతే ఈ అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ ఒక షార్ట్ ఫిలిం లో నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. సిటీలో సంక్రాంతి టైటిల్ తో తెరకెక్కిన ఆ షార్ట్ ఫిల్మ్ రేపు యూట్యూబ్ నందు విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సందడి మొదలైన నేపథ్యంలో తీసిన ఈ షార్ట్ ఫిలిం లో అల్లు శిరీష్ నటించారు.

 

 

ఇదే కాకుండా షార్ట్ ఫిలిం కు సంబంధించిన ప్రోమో వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. బావతో పాటు సంక్రాంతి జరుపుకోవాలని పల్లెటూరి నుండి పట్నం వచ్చిన మరదలితో సాగే సరదాలతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిందని ఈ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది.. ఇకపోతే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఏ బి సి డి చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించక పోవడంతో ఇప్పుడు కధల విషయంలో అల్లు శిరీష్ చాలా జాగ్రత్త పడుతున్నాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: