మన తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఎంతో ముఖ్యమైనది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో రైతులకు పంట అమ్మిన డబ్బు చేతికి రావడంతో పాటు ఇంటికి చుట్టాలు, కొత్త అల్లుళ్ళ రాక ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ పండుగను అందరూ కూడా రకరకాల పిండివంటలతో, కొత్త బట్టలతో, ఎంతో వేడుకగా జరుపుకోవడంతో పాటు ఈ పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఎంతో ఆనందంగా వీక్షిస్తుంటారు. ఇక ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. 

 

వాటిలో ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో ముందుకు నడుస్తుండగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు రేపు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలవైకుంఠపురములో ఎల్లుండి, అలానే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా బుధవారం విడుదల కానున్నాయి. ఇక ఈ నాలుగు సినిమాలు కేవలం వారం గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఆయా హీరోల అభిమానుల్లో మంచి పండుగ సందడితో పాటు మరొకవైపు సాధారణ ప్రేక్షకులు కూడా వాటిని చూడాలనే ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. 

 

వాస్తవానికి సంక్రాంతి సమయంలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏదైనా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా, పండగ సెలవలు పూర్తి అయ్యేవరకు కూడా అటువంటి సినిమాలకు సైతం పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ లభిస్తుంటాయి. దీనిని బట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కూడా పండుగ శోభతో, ప్రేక్షకులతో సంబరంగా కళకళ లాడుతుంటాయని చెప్పవచ్చు. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న మిగతా మూడు సినిమాల్లో ఏది ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: