తన మిమిక్రీతో తన కామెడీతో కడుపుబ్బా నావిస్తూ వచ్చిన స్టార్ కమెడియన్ అంటే గుర్తొచ్చేది మిమిక్రి శివారెడ్డి.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈయన జనాల్లో మంచి పేరును తెచ్చుకున్నాడు. సినిమానే లోకంగా ఉన్న శివారెడ్డి ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు. కానీ టీవీ షో లలో ఈవెంట్లలో కనిపిస్తూ జనాలను అలరిస్తూ వస్తున్నాడు. 

 

అయితే, ఈ మధ్యకాలంలో ఈయన ఎక్కడ కనిపించలేదన్న విషయం తెలిసిందే.. ఈ విషయం పై  తానూ ఓ సందర్భంలో మాట్లాడుతూ తనను కావాలనే ఇండస్ట్రీలో తొక్కేశారని కామెంట్లు చేసాడు ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.కమెడియన్ గా, ఫ్రెండ్ గా ఇలా చాలా రకాల పాత్రలు పోషించినట్లు.. ప్రకాష్ రాజ్, దాసరి నారాయణరావు లాంటి నట...

 

ఇంకా ఈయన మాట్లాడుతూ.. నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను నాకు తెలిసి ఎవరిని భాదపెట్టలేదు. నాకు తెలిసిన పక్క వాళ్లకు తోచిన సహాయాన్ని అందించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో పని చేసినంత కాలం ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పారీ. తనకు సినిమా పరిశ్రమలో అంతే రాసిపెట్టి ఉందేమో అని శివారెడ్డి వెల్లడించారు. 


శివారెడ్డిని ఎవరో తొక్కేశారని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయని.. అవి నిజమేనని అన్నారు. కానీ ఇప్పటివరకు అయితే తనను తొక్కేసిన వ్యక్తి పేరు బయటపెట్టలేదని.. తనకు అవకాశాలు లేకపోయినా.. ఆ పేరు మాత్రం బయటకి చెప్పలేదు. నాకు ఏ క్యారక్టర్ ఇచ్చిన కూడా చేసే నాకు గత కొంతకాలం నుండి రూమర్లు చేస్తున్నారు వాటివల్ల ఆఫర్లు రాలేదని అయన అన్నారు. మరి శివారెడ్డి ఆవేదనను గుర్తించి ఎవరైనా ఆఫర్లు ఇస్తారేమో చూడాలి..ఈ మధ్య సినీ ఇండస్ట్రీ లో పక్ష పాత బుద్దిని  చూపిస్తున్నారని కొందరు సీనియర్ నటులు అంటున్నారు.మరి ఈ విషయం ఎక్కడివరకు వెళ్తారో చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: