క్లాస్ గా కనిపించే మహేష్ కు.. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. అసలు మాసు క్లాసు తేడా లేదు మహేష్ సినిమా అంటే సిని ప్రియులకు ఇష్టమే. అలాంటి మహేష్ కొన్నాళ్లుగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసూ మాస్ ఆడియెన్స్ ను నిరాశపరచాడు. అయితే అలాంటి సూపర్ స్టార్ కామెడీ, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణగా నటించారు. సినిమాలో మహేష్ లుక్స్ ఎప్పటిలానే కిరాక్ అనిపించేలా ఉన్నాయని తెలుస్తుంది. 

 

సినిమా ట్రైలర్ లో మహేష్ డ్యాషింగ్ లుక్.. అదిరిపోయే డైలాగ్.. కామెడీ ఇవన్ని ఒక ఎత్తు కాగా లుంగి కట్టడం అదిరిపోయింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల్లో మహేష్ లుంగి కట్టగా ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా మహేష్ లుంగి కట్టి వస్తున్నాడు. మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేష్ లుంగి డ్యాన్స్ అదిరిపీయిందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. సాంగ్ లో మహేష్ లుంగి లో డ్యాన్స్ కుమ్మేస్తాడని తెలుస్తుంది.

 

బాబు లుంగీ కట్టాడు అంటే బాక్సులు బద్ధలవ్వాల్సిందే. సరిలేరు నీకెవ్వరు ఈ విధంగా కూడా సూపర్ హిట్ లుంగి సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు డిఎస్పి అదిరిపోయే మ్యూజిక్ అందించగా సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్స్ నటించారు. ఇక సంక్రాంతికి పోటీగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా వస్తుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రం, బన్ని హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న అల వైకుంఠపురములో సినిమాతో మహేష్ సరిలేరు నీకెవ్వరు పోటీ పడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: