సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై నిర్మించి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుక‌గా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, బండ్ల గణేష్, సంగీతలు కీలకపాత్రల్లో నటించారు. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. 

 

దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఈ ఈవెంట్ త‌ర్వాత నుండి టీమ్ మొత్తం.. మీడియా ఛాన‌ళ్ల‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు పనిలో పడ్డారు. ఇందులో భాగంగా బుధవారంనాడు ఆ టీమ్ ను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. దీనికి మహేష్, రష్మిక, అనిల్, విజయశాంతి, డీఎస్పీ వచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో సుమ, అనిల్ మధ్య సరదా సన్నివేశాలు జరిగాయి. అవేమిటంటే.. అనిల్ సుమను మీరు ఈ మధ్య షోలతో భాగా బిజీ అయిపోతున్నారు కదా రానున్నరోజుల్లో మీరు అందుబాటులో లేకుంటే నేను చేయడానికి మీ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నా అని అనగా సరే నేర్పిస్తా నేర్చుకోండి అని సుమ చెపుతుంది. 

 

అలాగే సుమ కూడా అనిల్‌పై ఎన్నో సెటైర్లు వేస్తూ న‌వ్వించింది. మ‌రియు అనిల్‌కు టాస్కులు ఇస్తూ ఆడేసుకుంద‌ని చెప్పాలి. అయితే అనిల్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా అదే రేంజ్‌లో స‌మాదానాలు ఇచ్చారు. ఇలా ఇంట‌ర్వ్యూ మొత్తం ఎంతో సరదాగా జరిగింది. కాగా, మహేష్ బాబు గతంలో మీడియాకు ప్రమోషన్‌ కార్యక్రమాలు కాస్త దూరంగా ఉండేవాడు. కానతీ ఇటీవల తాను కూడా స్వయంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడంతో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మీడియాకు స్పెషల్ ఇంటర్య్వూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఇక మ‌రికొన్ని గంట‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. దీంతో అన్ని చోట్ల సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌హేష్ అభిమానులు వీర లెవ‌ల్‌లో ర‌చ్చ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: