హాట్  అందాలతో కుర్రకారు మతులు పోగొట్టి తన అందం అభినయంతో అందరిని ఆకర్షించే  అందాల ముద్దుగుమ్మ రకుల్  ప్రీత్  సింగ్. పరేషనురా పరేషనురా అంటూ తెలుగు ప్రేక్షకులందరినీ తన హాట్ హాట్ అందాలతో పరేషాన్  చేసేసింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. వరుస  సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు మరోవైపు బిజినెస్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఇక తన అందాల ఆరబోతతో అందరికీ చెమటలు పట్టిస్తుంది ఈ అమ్మడు. ఇక దర్శక నిర్మాతలు అందరిని ఆకర్షించింది సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో  ముందుంటుంది. ఇప్పటికే చిన్న హీరోల నుండి  పెద్ద హీరోల వరకు అందరూ సరసన నటించి తన సత్తా చాటింది రకుల్ ప్రీత్. అదిరే అందం... అద్భుతమైన అభినయం రకుల్ ప్రీత్ సొంతం. 

 

 

 ఇక టాలీవుడ్ లో బాగా ఫిట్ గా  హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ముందు ఉంటుంది. మరీ సన్నగా కాకుండా మరీ బొద్దుగా కాకుండా కుర్రకారు మతులు పోగొట్టే అందంతో అసలు సిసలైన అందగత్తెగా రకుల్ ప్రీత్ సింగ్ కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులకు దూరం గా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. మన్మధుడు 2 తర్వాత తెలుగు తెరపై ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం నితిన్  సినిమాలో నటిస్తోంది. అయితే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న రకుల్ ప్రీత్ సింగ్... దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న నానుడిని ఫాలో అవుతూ ఇప్పుడే అన్ని చక్కబెట్టుకుంటుంది  . ఒకవేళ అవకాశాలు రాకపోయినా తనకున్న బిజినెస్ లు  చూసుకుంటూ హాయిగా బతికేస్తుంది ఈ అమ్మడు . అయితే ఎఫ్ 45 పేరుతో జిమ్ పెట్టి అందరికి కొవ్వును తగ్గించడమే కాదు... పనిలోపనిగా తన కొవ్వును కూడా ఎప్పటికప్పుడు తగ్గించు కుంటూనే ఉంటుంది. 

 

 

 ఇక తాజాగా మరో ఫిట్ నెస్  మంత్రంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా సినిమాకు మరింత ఫిట్ గా  తయారవుతూ... రోజురోజుకు సన్నబడి పోతుంది రకుల్. ఇక మన్మధుడు 2 సినిమా ప్లాప్ కావడంతో ఈ అమ్మడికి పెద్ద దెబ్బ పడింది అని చెప్పాలి. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో ఫిట్నెస్ పై ఫోకస్ చేసింది ఈ భామ . ప్రస్తుతం హిందీ తెలుగు భాషల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడికి సినిమాల్లో నటించడం ఎంత ఇష్టమో బిజినెస్ చేయడం కూడా అంతే ఇష్టం. అందుకే అటు సినిమాలను ఇటు  బిజినెస్ ను  బాలన్స్ చేస్తూ దూసుకుపోతున్నది. ఇక అప్పుడప్పుడు తన జిమ్  వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా తాజాగా తన జిమ్  వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది . ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఫిట్నెస్ పెంచుకుంటూ రకుల్ ప్రీత్ సింగ్ మరింత అందంగా తయారవుతోందని నెటిజన్లు  కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: