స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక పోస్టర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. అదే బన్ని కోడిపుంజుని పట్టుకుని ఉన్న పోస్టర్. అదసలు సినిమాలో అనుకోలేదని.. ఒకరోజు షూటింగ్ టైంలో మేమంతా అక్కడ ఉండగా ఒక 5 నిమిషాల్లో బన్ని వచ్చాడు. వచ్చేప్పుడు కోడి పట్టుకుని వచ్చాడు.

 

అప్పుడు డైరక్టర్ కు సలహా ఇచ్చాడట. దీనితో మనం ఏదైనా చేద్దామా అని బన్ని అడుగగా బాగుందని త్రివిక్రం కోడి ఓనర్ తో మాట్లాడి ఒక సీక్వెన్స్ చేశారట. ఇది బన్ని కోడి పుంజు పోస్టర్ వెనుకాల ఉన్న కథ. అయితే కావాలని పెట్టినా బాగుందని పెట్టినా సినిమా సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి అంటే మనకందరికి గుర్తుకు వచ్చే కోడిపందెం ను గుర్తుకు తెచ్చేలా ఈ పోస్టర్ ఉంటుంది. ఇక సంక్రాంతి బరిలో ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా వస్తుది.

 

సరిలేరు నీకెవ్వరు సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. అల వైకుంఠపురములో సినిమాకు ఎస్.థమన్ మ్యూజిక్ అందించగా.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. రిలీజైన దర్బార్ రొటీన్ అనిపించుకోగా ఈ సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుందో చూడాలి. తప్పకుండా రెండు సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో నందమూరి హీరో కళ్యాన్ రాం సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఎంత మంచివాడవురా సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: