తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ కి మంచి ఆదరణ వచ్చిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే తెలుగు లో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది.  బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 2 కి నాని, సీజన్ 3 కి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరించారు.  బిగ్ బాస్ సీజన్ 1 కి మోడల్, నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  చివరి వరకు అన్ని టాస్క్ ల్లో తనదైన స్టైల్ చూపించి రన్నర్ గా నిలిచారు.  బిగ్ బాస్ సీజన్ 1 కి శివబాలాజీ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. 'బిగ్ బాస్ 1' ద్వారా ఆదర్శ్ బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు.

 

'బిగ్ బాస్' సీజన్ 1 ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.  ఆ తర్వాత సినిమాల్లో పలు ఛాన్సులు అందుకున్నాడు. తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదర్శ 'అరవింద సమేత' సినిమా గురించి స్పందించారు. 'త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో 'అరవింద సమేత'లో నటించాను. 

 

ఈ మూవీలో ఎన్టీఆర్ తో ఓ సన్నివేశం ఉందని.. తనకు ఎంతగానో నచ్చిన సీన్ అన్నారు.  అయితే మూవి రిలీజ్ సమయంలో ఎడిటింగ్ లో ఆ సీన్ తీసివేశారు. అలాంటి సీన్ లేపేయడం నాకు చాలా బాధను కలిగించింది. త్రివిక్రమ్ గారి దగ్గర కూడా నా ఆవేదనను వ్యక్తం చేశాను. అయితే భవిష్యత్ లో ఆయన సినిమాల్లో మంచి ఛాన్సు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.  ప్రస్తుతం క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ మూవీలో మంచి పాత్రలో నటిస్తున్నానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: