కొత్త సంవత్సరం వచ్చింది అంటే న్యూ ఇయర్ వేడుకలతో పాటుగా తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ కూడా అందరికి భోగ భాగ్యాలను అందిస్తుందని నమ్ముతారు. అలాంటి పండుగ సమయాన అభిమాన నటుడి సినిమా రిలీజైతే పండుగ శోభ మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ పై తమ సత్తా చాటడానికి వస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్. నందమూరి కళ్యాణ్ రాం ఎంత మంచి వాడవురా సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మహేష్ అల్లు అర్జున్ సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది.

 

భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్ తో సూపర్ ఫాం లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఇక సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ లో మహేష్ చూపించిన వేరియేషన్స్ కచ్చితంగా సంక్రాంతి బాక్సాఫీస్ బాద్ షా మహేష్ బాబే అవుతాడని అంటున్నారు. ప్రేక్షకుల నాడి తెలిసిన అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ రేంజ్ కు తగినట్టుగా సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కించాడని టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.

 

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. త్రివిక్రం, బన్ని సూపర్ హిట్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై కూడా తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కేవలం క్లాస్ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పంచభక్ష పరవన్నం పెడుతుందని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఎవరు విజయ పతాకం ఎగురవేస్తరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: