‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించిన పాటలు ఊహించిన స్థాయిలో యూత్ కు కనెక్ట్ అవ్వకపోవడంతో ఈ మూవీ బయ్యర్లు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి ప్రేక్షకులని టార్గెట్ చేసుకుని వస్తోంది అనేది స్పష్టంగా అర్ధం అవుతోంది. గత సంవత్సరం అనిల్ రావిపూడి ఇలాగే సంక్రాంతి రోజున వచ్చి ఎఫ్2 తో బ్లాక్ బుస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే . వెంకటేష్ - వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఒక్క దెబ్బకి బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది.

 

 

గతేడాది వచ్చిన అన్నీ సినిమాల్లో ఎక్కువగా కలక్ట్ చేసింది . సొ ఈ ఏడాది కూడా అనిల్ రావిపూడి పైసా వసూల్ ఎంతెర్టైనర్ ఇస్తాడు అని నమ్ముతున్నారు చాలామంది.  2 గంటల 39 నిమిషాల నిడివితో జనవరి 11న వస్తుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ చిత్రంలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయని.. కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది.  

 

 

సినిమా మీద బాలివుడ్ ఎందుకో విపరీతంగా  దృష్టి పెట్టింది... వాళ్లు రీమేక్ చేసే ఆలోచ‌న‌లో కామెడీ బాగుంటే.. అందుకే రిజ‌ల్ట్ కోసం అక్క‌డ స్టార్ హీరోలు ఉత్కంఠ‌తో ఉన్నారు. కామెడీ అనేది ఇప్పుడు హిందీ లో హాట్ కేక్ లాగా అమ్ముడు అవుతోంది . ప్రస్తుతం హిందీ లో హౌస్ ఫుల్ సీరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యం లో సౌత్ ఇండియా నుంచి ఒక మంచి కామెడీ సినిమా వస్తే గనక వదులుకోవడం హిందీ పరిశ్రమ కి అస్సలు ఇష్టం లేదు .. దీంతో ఈ సినిమా మీద హిందీ హీరోలు అందరూ కన్నేశారు అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: