శేఖర్ కమ్ముల..వరుణ్ తేజ్ .. సాయి పల్లవిల కాంబోలో వచ్చిన 'ఫిదా' సినిమా టైటిల్ కు తగ్గట్లుగానే ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేకర్ కమ్ముల ఎట్టకేలకు నాగచైతన్య హీరోగా మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా ఒక క్యూట్ లవ్ స్టోరీని మొదలు పెట్టాడు. ప్రేమికుల రోజున ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా ప్రారంభమైనప్పుడు వార్తలు వచ్చాయి. కాని షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగకపోవడం వల్ల సినిమా సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.

 

ఇక ఈ సినిమా నుండి సంక్రాంతి కానుక రాబోతున్నట్లుగా తాజా సమాచారం. ఫిల్మ్ నగర్ ముంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు టైటిల్ విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న ఫస్ట్ లుక్ లో టైటిల్ ను రివీల్ చేసే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ద్వారా అందిన సమాచారం. 

 

ఫిదా సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవిల కాంబో ఖచ్చితంగా ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయమని ఇప్పటి నుంచే అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక దర్శకుడు తన మార్క్ స్టైల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాడౌ కాబట్టి సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు నాగచైతన్య కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతారట. చాలా విభిన్నమైన నేపథ్యంలో ఒక సింపుల్ లవ్ స్టోరీని ఈ సినిమాలో దర్శకుడు చూపించబోతున్నాడట. సంక్రాంతికి రాబోతున్న ఫస్ట్ లుక్ తో సినిమాలో ఉన్న అసలు విషయం తెలిసే ఛాన్స్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: