స్టార్ మా చానల్ లో ప్రసారమయే కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని వారు బహుశా ఉండరేమో. రాత్రి ఏడున్నర సమయం అయిందంటే ఇంటిల్లి పాది వచ్చి టీవీలకి అతుక్కుపోతారు. అంతగా ఈ సీరియల్ కి అడిక్ట్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్ర‌స్తుతం కార్తీకదీపం సీరియల్ దెబ్బకు బుల్లితెరపై రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. మొత్తం 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది.

 

ఇక ఈ టీవీ సీరియల్‌లో ట్విస్టుల మీద ట్విస్టులతో దూసుకెళ్తుంది. అయితే ఇప్పటికే డాక్టర్ బాబు మనస్సును మార్చేందుకు పిల్లలు ఇద్దరూ కలిసి వేస్తున్న ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయి. ఇందులో భాగంగా దీప దగ్గర పెరుగుతున్న సౌర్యకు తన తండ్రి డాక్టర్ కార్తీక్ అన్న విషయం తెలిసిపోయింది. మరోవైపు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. అలాగే అటు కోర్టు ఇచ్చిన గడువు సైతం పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో సీరియల్ ఒక అనుకోని మలుపు తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. 

 

అయితే పిల్లలు ఇద్దరు తమ తల్లితండ్రులను కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న నేపథ్యంలో వంటలక్క ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారట. ఇక తాజాగా స్కూల్ ఫంక్షన్‌లో రెండో కూతురు హిమ తన తండ్రికి వంటలక్కను ఇచ్చి పెళ్లి చేయాలని ఉందని అందరి ముందు కోరిక కోరింది. అదే స్టేజీ మీద ఉన్న డాక్టర్ మోనిత షాక్ కు గురైంది. దీంతో వంటలక్క ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రేటింగ్స్ లో అత్యధిక పాయింట్లు సాధించిన కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ ప్రస్తుతం మొదటి సీజన్ పూర్తి అవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: