క్లాస్ గా కనిపించే మహేష్ సోషల్ మెసేజ్ సినిమాలతో కూడా సంచలన విజయాలను అందుకుంటాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి కేవలం మహేష్ బాబు తీశాడు కాబట్టే హిట్ అయ్యాయన్న భావన వస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తే సూపర్ హిట్ కొట్టడం మహేష్ కు పెద్ద కష్టమేమి కాదు కాఇ తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం ఉండాలని అనుకుంటాడు సూపర్ స్టార్ మహేష్. ఇక లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తన ప్రతాపం బాక్సాఫీస్ పై చూపించేందుకు వస్తున్నాడు మహేష్.

 

అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాస్ అభిమానులకు సంక్రాంతి పండుగ డబుల్ బొనాంజా కన్ ఫాం అనేలా ఉంది. సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ చూస్తే ఆర్మీ ఆఫీసర్ గా పనిచేసే అజయ్ కృష్ణ కర్నూలు వచ్చి అక్కడ విజయశాంతికి అండగా ఉంటాడు. కొన్నాళ్లుగ క్లాస్ సినిమాలకే అంకితమైన మహేష్ ఈ సినిమాలో మాస్ అంశాలతో వస్తున్నాడు.

 

ట్రైలర్ చూస్తే మాస్ ఎలిమెంట్స్ పుష్కలనంగా పెట్టినట్టు తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమాతో పోల్చితే సరిలేరు నీకెవ్వరు సినిమాకే మాస్ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. మాస్ కు ఎక్కితే మాత్రం ఇక ఈ సినిమా మరో సెన్సేషనల్ మూవీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు కరెక్ట్ గా మాస్ ఆడియెన్స్ అంచనాలను అందుకుంటే మాత్రం వాళ్లకు మహేష్ మరింత దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి సరిలేరు నీకెవ్వరుతో మహేష్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ సినిమాతో పాటుగా వస్తున్న అల వైకుంఠపురములో సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేయగా అది కేవలం క్లాస్ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చేలా ఉందని అంటున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: