టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాటలు  మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ  సినిమాలో  స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇకపోతే సినిమాలో  సీనియర్ నటి టబు కూడా ఓ పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు... బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో మరోసారి అల్లు అర్జున్ ఖాతాలో భారీ హిట్ చేరడం ఖాయం అని అర్థమవుతుంది. 

 

 

 కాగా ప్రస్తుతం అలా వైకుంఠపురములో చిత్ర బృందం  సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మీడియాతో మాట్లాడారు. వారసులు కూడా  సినిమా ఇండస్ట్రీ లోకి రావడం అనేది  తమ ఇష్టాఇష్టాల మీద  అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తన తండ్రి అల్లు అరవింద్  నిర్మాత కావడం తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం ఎంతో సులభంగా జరిగిపోయిందని... కానీ తనకున్న బ్యాక్గ్రౌండ్ మాత్రం కేవలం చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యే అంతవరకు ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఎంత సినిమా కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా తమ కష్టాలు తమకు  ఉంటాయని అల్లు అర్జున్ తెలిపారు. అయితే  స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంటే తనకు ఎంతో గౌరవంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా ఎదిగిన వారిని తాను ఎంతో గౌరవిస్తాను అని  తెలిపారు. 

 

 

   

 ఇకపోతే  వైకుంఠపురములో  ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా పాటలు అయితే ఒక రేంజ్ లో రికార్డులు సైతం సృష్టించాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకుల అందరి నోటిలో నానుతూనే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులందరినీ సినిమా పాటలు ఉర్రుతలూగిస్తున్నాయి. కాగా అల వైకుంఠపురములో  సినిమాకి ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ పోటీ నెలకొని ఉంది. ఒక్క రోజు  తేడాతోనే అల్లు అర్జున్ మహేష్ బాబు సినిమాలు విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా నిలిచి గెలుస్తుంది  అనేది సినీ ప్రేక్షకుల్లో  ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: