పటాస్ షో లో హోస్ట్ గా కొనసాగేందుకు యాంకర్ వర్షిణి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆమె కొంటె చేష్టలను చూస్తే చిన్నపిల్లోడికేనా అర్థమవుతుంది. గతంలో బుగ్గ కొరికి పటాస్ షో కి అశేష పబ్లిసిటీని వర్షిణి తెచ్చింది. తన స్థానాన్ని పటాస్ షో లో ఎప్పటికీ స్థిరపరచి కోవాలని ఆమె బోల్డ్ గా చేసే పనులను చూసి చాలామంది విమర్శిస్తుంటే మరికొంతమంది మాత్రం జాలి పడుతున్నారు. ఎవరేమనుకున్నా వర్షిణి మాత్రం పాపం ఇప్పటికీ అలానే ఎన్నో పడరాని పాట్లు పడుతుంది. ఢీ షో లో పంచులు మహారాజైన ఆది పక్కన నిలదొక్కుకోవడానికి.. అలాగే పటాస్ షో లో పంచుల పితామహ చలాకి చంటి పక్కన సరి తూలడానికి ఆమె అన్నిటినీ చేయడానికి ముందడుగు వేస్తుంది తప్ప వెనుకడుగు మాత్రం వేయడం లేదు.



అరే ఇవన్నీ ఎందుకు చేస్తుంది రా బాబు అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్టే.. ఎందుకంటే అతి త్వరలోనే శ్రీముఖి పటాస్ షో లోకి ఎంటర్ అవబోతుంది అని బలంగా టాక్ వినిపిస్తుంది కాబట్టి. ఆమె వచ్చి ఢీ షో, పటాస్ షో లో యాంకర్గా చేస్తున్న వర్షిణిని రీప్లేస్ చేస్తే ఆమె పరిస్థితి దారుణంగా ఉంటుందనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ప్రయత్నించి తన స్థానాన్ని పర్మినెంట్ చేసుకోవాలి అనుకుంటుంది వర్షిణి.


ఈ క్రమంలోనే తాజాగా జరిగినటువంటి పటాస్ షో లో అవినాష్ తో కలిసి లవ్వు పాఠాలను చలాకి చంటి ఇంకా ఆడియన్స్ కు నేర్పించేందుకు ఈమె సిద్ధమైంది. అయితే ముక్కు అవినాష్లవ్ క్లాసులో మాట్లాడుతూ.. ఫస్టు అమ్మాయి కనపడితే ఇలా పట్టుకోవాలి అంటూ వర్షిణి చేతులను పట్టుకుంటాడు. అలాగే వర్షిణి కళ్ళలోకి చూస్తూ లవ్ క్లాస్ చెప్పేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఆడియన్స్కి చెపుతాడు అవినాష్. దాంతో అవినాష్ మాటలకు మద్దతిస్తూ అవును లవ్ క్లాస్ కావాలా వద్దా అంటూ వర్షిణి అడగగా.. అవినాష్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ.. లవ్ క్లాస్ అయిపోయిన తర్వాత బెడ్ రూమ్ క్లాసులు చెప్పుకుందాం అని అంటాడు. దాంతో, వర్షిణి సీరియస్ అయ్యి అవినాష్ చెంప చెల్లుమనిపిస్తుంది. దాంతో అవినాష్ ఒక్కసారిగా కంగు తింటాడు. కానీ కెమెరా ముందు మాత్రం ఏమీ జరగనట్లు నటించాడని తెలుస్తుంది.

 

ఏదేమైనా ఈ లవ్ క్లాసులో ఒప్పుకోవడం తర్వాత అవినాష్ ఓవరాక్షన్ చేయడం తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన ఒక హాట్ టాపిక్ గా మారడం ఒక విధంగా పటాస్ షో కి ప్రయోజనకరమే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వర్షిణి పటాస్ షో యొక్క పాపులారిటీని ఏం చేస్తూ తన హోస్ట్ స్థానాన్ని బలపరచుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: