మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా రేపు విడుదల కానుంది. మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్నా నటించగా విజయశాంతి, సంగీత, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాలో ప్రేక్షకులకు రెండు స‌ర్‌ఫ్రైజ్‌లు ఉన్నాయి. 
 
సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ రెండు స‌ర్‌ఫ్రైజ్‌లు మాత్రం ప్రేక్షకులను అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రెండు స‌ర్‌ఫ్రైజ్‌లలలో ఒకటి విజయశాంతి ప్రొఫెసర్ రోల్... చాలా కాలం తరువాత సినిమాల్లో నటిస్తున్న విజయశాంతి పాత్ర సినిమాలో ప్రేక్షకులను స‌ర్‌ఫ్రైజ్‌ చేసే విధంగా ఉండనుందని తెలుస్తోంది. విజయశాంతితో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా విడుదలైన 
30 ఏళ్ల తరువాత విజయశాంతితో కలిసి మహేష్ నటించాడు.. 
 
అప్పట్లో కొడుకు దిద్దిన కాపురం హిట్ కాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని తెలుస్తోంది. మరో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా దాదాపు పది సంవత్సరాల తరువాత ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సంగీత పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రెండో సర్ ప్రైజ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు నటించటం. 
 
సరిలేరు నీకెవ్వరు సినిమాలో కృష్ణ కొన్ని సెకన్ల పాటు నటించాడని ఒక పాటలో స్టెప్పులు కూడా వేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం రేపటిదాకా ఆగాల్సిందే. ప్రేక్షకుల్లో సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస సక్సెస్ లతో జోరు మీదున్న అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: