బుల్లితెర హాస్యనటుడిగా ప్రసిద్ధిగాంచిన చమ్మక్ చంద్ర యొక్క గత జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో కష్టాలు కన్నీళ్లు మాత్రమే కనబడతాయి. కానీ ఆ కష్టాలన్నీ ఎదుర్కొని నిజ జీవితంలోనే ఒక హీరోలాగా పైకి వచ్చిన చమ్మక్ చంద్ర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. తన స్కిట్లు అంటే కూడా అందరికీ వల్లమాలిన అభిమానం. అతడు ఎవరినీ కించపరచడం లాంటివి చేయకుండా అందరినీ అలరించే విధంగా అందరికీ నవ్వులు పూయించే విధంగా తన స్కిట్లను రూపొందించి కొన్ని కోట్ల తెలుగు ప్రేక్షక అభిమానులను సంపాదించారు అంటే అది అతిశయోక్తి కాదు.


ఇక చంద్ర నేపథ్యం గురించి చెప్పుకోవాలి అనుకుంటే... చమ్మక్ చంద్రది తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా లోని వెంకటాపురం తండా. తన తల్లిదండ్రులకు ముగ్గురు కుమారులు కాగా చంద్ర పెద్దవాడు. తన చిన్నతనం నుండి మెగాస్టార్ చిరంజీవి పాటలకు రికార్డింగ్ డాన్సులు వేస్తూ ఎదిగారు చంద్ర. తన పదవ తరగతి పూర్తి చేయగానే సినిమాల్లో పాత్రలను సంపాదించుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన చంద్ర... రెండు వేల రూపాయలతో యాక్టింగ్ స్కూల్లో చేరి ట్రైనింగ్ పుచ్చుకున్నారు. ఆ తరువాత జై చిత్రంలో పెంచి మొట్టమొదటిసారిగా వెండితెరపై తళుక్కుమన్నారు. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో మొత్తం 50 సినిమాల్లో నటించారు. చివరి సినిమా ఏంటంటే వెంకటేష్ నటించిన వెంకీ మామ.


ఇకపోతే, చమ్మక్ చంద్ర స్కిట్ లు అంత అద్భుతంగా ఎలా మారుతాయి అంటే... సాక్షాత్తు చమ్మక్ చంద్రనే ప్రతీ స్కిట్ యొక్క స్క్రిప్ట్, డైలాగులను మూడు రోజులపాటు రాస్తారట. ఆ తర్వాత మిగతా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ని పూర్తిచేసి షూటింగ్ని ప్రారంభిస్తారు. ఒకసారి మీరు చంద్ర స్కిట్ లను గమనిస్తే ఓపెనింగ్ సాంగ్, ఇంట్రడక్షన్, మిడిల్ డ్రామా, క్లైమాక్స్ డ్రామా స్పష్టంగా అర్థం అవుతాయి. అయితే ఈ విధంగా ప్రతి స్కిట్ ని చమ్మక్ చంద్ర ప్రణాళికగా రెడీ చేయడం వలన అతని స్కిట్లు అంత క్లియర్ కట్ గా ఉంటాయని, ఇంకా ప్రేక్షకులను ఆకర్షిస్తాయని తెలుస్తోంది.


ఇంతకీ అతను చేసే స్కిట్లు కి ఇన్స్పిరేషన్ ఏంటంటే... తన ఊరిలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు, కష్టసుఖాలు. ఇక తన కుటుంబం గురించి మాట్లాడుకుంటే.. చంద్ర పద్మావతి ని పెళ్లి చేసుకోగా వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిల సంతానం. అయితే ఇక్కడ అందర్నీ ఎమోషనల్ చేసే విషయం ఏమిటంటే.. ఎంతో కష్టపడి మన అందర్నీ నవ్విస్తున్న చంద్ర.. తాను చనిపోయిన తరువాత కూడా ఇతరులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తన గుండెను కళ్ళను మోహన్ ఫౌండేషన్ కు అవయవ దానం చేయడానికి అంగీకరించారు. దాంతో మన చంద్ర ఎప్పటికీ బ్రతికే ఉంటారని, తన సూపర్ గ్రేట్ అని అభిమానులు బాగా కొనియాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: