అనీల్ రావిపూడి ...అతి కొద్ది కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్త్ లో చేరిపోయాడు. నందమూరి కళ్యాణ్ రాం హీరోగా పటాస్ సినిమాని తెరకెక్కించి మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. అంతేకాదు కళ్యాణ్ రాం కి కూడా ఈ సినిమా మంచి హిట్ సినిమా తన కెరీర్ లో నిలిచిపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టి సాయి ధరం తేజ్-రాశీ ఖన్నా హీరో హీరోయిన్స్ గా సుప్రీమ్మ్ సినిమాని తెరకెక్కించాడు మరోసారి హిట్ కొట్టాడు. దాంతో ఇండస్ట్రీ దృష్ఠి ఒక్కసారిగా అనీల్ రావిపూడి మీద పడింది. హీరోలందరు అనిల్ల్ తో సినిమా చేసినా చేయకపోయినా కథ వినడానికి మాత్రం ఆసక్తి కనబరచారు. అలాగే నిర్మాతలు కూడా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించడంతో నిర్మాతలు అనిల్ ని అడ్వాన్సులిచ్చి లాక్ చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. 

 

ఆ నేపథ్యంలోనే మాస్ మహా రాజా ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాంతో అనిల్ చెప్పిన కథ నచ్చి వెంటనే ఒకే చేశాడు. ఆ సినిమా రవితేజకి అమంచి సక్సస్ ని ఇచ్చింది. ఇలా వరుసగా మూడు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మాస్ డైరెక్టర్. దాంతో ఇక ఈసారి మల్టీస్టారర్ తీయాలని సిద్దమయ్యాడు. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఒక యంగ్ హీరోలతో సినిమాని తెరకెక్కించాలన్న ఉద్దేశ్యంతో ఎఫ్ 2 కి విక్టరీ వెంకటేష్-మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లను సెలెక్ట్ చేసుకొని మైండ్ బ్లోయింగ్ హిట్ ని కొట్టాడు. ఏకంగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా సక్సస్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు అనీల్ కి గోల్డెన్ ఛాన్స్ ని ఇచ్చాడు. 

 

ఇక ఇప్పటికే స్పెషల్ షోస్ పడ్డ ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫ్యాన్స్ కి ఈ సినిమా పిచ్చ పిచ్చ గా నచ్చేసింది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి క్లాస్ సినిమాలు చూసిన అభిమానులకు అనీల్ పోకిరి, దూకుడు వంటి మాంచి మాస్ ఎంటర్‌టైనర్ తో మహేష్ ని చూపించి వాళ్ళలో కొంతకాలంగా ఉన్న అసంతృప్తిని తొలగించాడు. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమా రొటీన్ గా ఉందని, మహేష్ ని చాలా ఊహించుకున్నామని అయితే అనీల్ ఈ విషయంలో కొంతమంది ప్రేక్షకులను బాగా డిసప్పాయింట్ చేశాడని ఫీలవుతున్నారట. నాలుగు సూపర్ హిట్స్ ఇచ్చిన అనీల్ కి సూపర్ స్టార్ మహేష్ బంగారం లాంటి ఛాన్స్ ఇస్తే ఇలా చేశాడేంటి అని అనుకుంటున్నారట. మొత్తానికి సరిలేరు మాత్రం పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: