సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, ఒకప్పటి సీనియర్ నటీమణి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా ద్వారా నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సరిలేరు యూనిట్ మంచి నమ్మకం వ్యక్తం చేస్తోంది. 

 

ఇక ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి ఆట నుండి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి సినిమాను ఎక్క‌డా సుత్తి లేకుండా సూటిగా స్టార్ట్ చేసేశాడు. సినిమా ప్రారంభ‌మైన తొలి 15 నిమిషాల‌కే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం, ఆ తరువాత నుండి సినిమా హై ఓల్టేజ్‌లో దూసుకుపోతోంది. అనంతరం విజ‌య‌శాంతి ఎంట్రీ, ఆ త‌ర్వాత త‌మ‌న్నాతో డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ ఆ వెంట‌నే ఆర్మీలో మ‌హేష్ ఆధ్వ‌ర్యంలో ప‌వ‌ర్‌ఫుల్‌ఫైట్, మ‌ధ్య‌లోనే రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో కామెడీ తొలి 20 నిమిషాల్లోనే అద‌రిపోయే జోష్ ప్రేక్ష‌కులు కంటిన్యూగా విజిల్స్ వేస్తూనే ఉన్నారు. 

 

ఈ ఫైట్‌లో మహేష్ బాబు ఉగ్ర‌వాదుల చెర‌ నుంచి పిల్ల‌ల‌ను కాపాడ‌తాడు. ఈ సీన్ నిజంగా ఎంతో బాగుందని చెప్పాలి. ఆ తరువాత వచ్చే ట్రైన్ ఎపిసోడ్, కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ మంచి జోష్ తో సాగుతుంది. అనంతరం మొదలైన సెకండ్ హాఫ్ మెల్లగా ప్రేక్షకుడిని సినిమాకు మరింతగా కనెక్ట్ చేస్తుంది. ఇక మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్, కామెడీ సీన్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్, అలానే హృద్యంగా సాగె కామెడీ సీన్స్, సినిమాకు మంచి బలాన్నిచ్చాయి. ఓవర్ ఆల్ గా సినిమా మంచి టాక్ సంపాదించినట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: