సూపర్ స్టార్ మహేష్ బాబుతో యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా లేని దర్శకుడు అనిల్ ,ఈ సినిమాను కూడా తన పంథాలోనే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సంగీత, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, వెన్నెలకిషోర్, శ్రీనివాసరెడ్డి, బండ్ల గణేష్, రఘు బాబు, రావురమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యువ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించారు. తమ బ్యానర్లపై మహేష్, దిల్ రాజు, 

 

అనిల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ఫుల్ ఆర్మీ మేజర్ పాత్రలో ఇవ్వడంతో ప్రారంభం అయ్యే ఈ సినిమా, ఆ తరువాత ఒక ఫైట్ తో పాటు, విజయశాంతి పవర్ఫుల్ ఎంట్రీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, ఆపై అసలైన ట్రైన్ కామెడీ సీన్ స్టార్ట్ అవుతుంది. చేతిలో కిళ్లి పెట్టి పెళ్లి చేసేస్తారా అని ర‌ష్మిక త‌ల్లి సంగీత‌తో మ‌హేష్ కామెడీ డైలాగ్అదిరిపోతుంది, ఆ తరువాత రైల్వేస్టేష‌న్‌లో ర‌ష్మిక త‌న పెళ్లిని చెడ‌గొట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ వెంట‌నే దేవుడా ఓ క్యూట్, స్వీట్, హ్యాండ్‌స‌మ్ కుర్రాడిని చూపించు తండ్రి అంటుంది. తరువాత మ‌హేష్ క‌న‌ప‌డ‌డం, ఐల‌వ్‌యూ చెప్ప‌డం, ర‌ష్మిక త‌ల్లి సంగీత మ‌హేష్ చేతిలో చిన్న కిల్లీ పెట్టి ఎంగేజ్‌మెంట్ అయ్యింది ఇంక పెళ్లే అని అంటుంది. 

 

ఆ వెంట‌నే మ‌హేష్, రష్మికను సాటి సోద‌రి అన‌గానే వ‌య‌స్సులో ఉన్న ఆడ‌పిల్ల‌ను సోద‌రి అన‌కు అనడం, ఏదో పొర‌పాటులో అన్నాన‌ని మహేష్ రియాక్ట్ అవడం ఓవ‌రాల్‌గా క‌మెడీ సూప‌ర్‌గా పేలుతోంది. అనంతరం మరికొన్ని హిలేరియస్ ఫన్నీ సీన్స్ తో ట్రైన్ ఎపిసోడ్ మొత్తం దద్దరిల్లుతుంది. ఆతరువాత హీరో కర్నూలు చేరడం, విజయశాంతితో సీన్స్ తరువాత వచ్చే సాంగ్, ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ గా ఉన్నాయి. ఆపై ఇంట్రెస్టింగ్ గా సాగె సెకండ్ హాఫ్, మెల్లగా పుంజుకుని సినిమాపై ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే మధ్యలో యాక్షన్ సీన్స్ తో పాటు అలరించే ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని కూడా జోడించిన అనిల్ రావిపూడి, ఓవర్ ఆల్ గా ఈ సినిమాని మంచి సక్సెస్ చేసాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి టాక్ లభిస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: