యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, ర‌ష్మిక‌మండ‌న్న జంట‌గా న‌టించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. చాలా మంది మెయిన్ యాక్ట‌ర్స్ ఈ చిత్రం నుంచి రీ ఎంట్రీ ఇస్తున్నారు. విజ‌య‌శాంతి, సంగీత, బండ్ల గ‌ణేష్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు రీ ఎంట్రీ ఇచ్చారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫుల్ కామెడీ అండ్ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కింది. 

 

దాదాపు 80 నిమిషాల పాటు ఫ‌స్టాఫ్ అంతా న‌వ్వుల‌తో థియేట‌ర్ అంతా ద‌ద్ద‌రిల్లింది. అటు కామెడీ, ఫ‌స్టాఫ్ అంతా సినిమా స్టార్టింగ్ నుంచి ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు ఎక్క‌డా బ్రేక్ లేకుండా ఎక్క‌డా చూసే ప్రేక్ష‌కుడికి బోరింగ్ క‌నిపించ‌కుండా  కామెడీయే థియేట‌ర్ల‌లో నాన్‌స్టాప్ న‌వ్వులే న‌వ్వులు. ఆర్మీలో మేజ‌ర్ అజ‌య్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్ప‌టి నుంచి ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో విజ‌య‌శాంతి అండ్ ఫ్యామిలీని కాపాడే వ‌ర‌కు సినిమా ఎక్క‌డా డ్రాప్ అవ్వ‌కుండా ఒక్క‌టే స్పీడ్‌గా వెళుతుంది. ఏ ఒక్క సీన్‌లో కూడా  గ్రాఫ్ ఎక్క‌డా డౌన్ కాకుండా అనిల్ రావిపూడి చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేశార‌నే చెప్పాలి. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో ఫైట్‌తో చిన్న బ్రేక్ ప‌డింది. ఫైట్స్ కూడా చాలా బాగా వ‌చ్చాయి. రామ్‌ల‌క్ష్మ‌ణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేనప్ప‌టికీ ఫైట్ సీన్స్ చాలా అద్భుతంగా చేశారు. 

 

ఎప్పుడైనా స‌రే ద‌ర్శ‌కుడు అనేవాడు సినిమా చూసే వాడికి ఎక్క‌డా కాస్త కూడా బోర్ కొట్ట‌కుండా ఏమాత్రం డ‌వున్ అవ్వ‌కుండా తీశాడంటేనే స‌క్సెస్ సాధించిన‌ట్టే. అలా ఎక్కువ శాతం కామెడీ మ‌రియు స‌స్పెన్స్ చిత్రాల‌కు ఎక్కువ‌గా కుదురుతుంది. వేరే జోన‌ర్ల‌కంటే కూడా ఆ స్కోప్ ఎక్కువ‌గా ఈ రెండు జోన‌ర్ల‌కు ఉంటుంది. వీటిని కూడా చాలా జాగ్ర‌త్త‌గా రిపీటెడ్ కామెడీతో బోర్ కొట్టించినా మ‌ళ్ళీ జ‌నం న‌వ్వ‌రు. అలా కాకుండా చాలా కేర్‌గా మంచి సెటైరిక‌ల్‌గా ఎక్క‌డా గ్రాఫ్ త‌ప్ప‌కుండా చేయ‌డం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిని మెచ్చుకోవ‌ల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: