సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రంలో మ‌హేష్ బాబుకు క‌న్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా న‌టించింది. కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉండేలా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ సంక్రాంతి కానుక‌గా సంక్రాంతి 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.  ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, బండ్ల గణేష్, సంగీతలు కీలకపాత్రల్లో నటించారు. 

 

తన కెరీర్ లో తొలిసారిగా మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ముందు నుంచి ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక ఆటలు ప్రదర్శిస్తున్నారు. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. 80 నిమిసాల ఫ‌స్టాఫ్‌లో థియేట‌ర్‌ ద‌ద్ద‌రిల్లింది. ఎందుకంటే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు అంతా కామెడీయే ఉండ‌డంతో థియేట‌ర్ల‌లో నాన్‌స్టాప్ న‌వ్వులే వినిపిస్తాయి. ఆర్మీలో మేజ‌ర్ అజ‌య్‌గా ఎంట్రీ ఇచ్చినప్ప‌టి నుంచి ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో విజ‌య‌శాంతి అండ్ ఫ్యామిలీని కాపాడే వ‌ర‌కు సినిమా ఎక్క‌డా డ్రాఫ్ అవ్వ‌కుండా స్పీడ్‌గా వెళ్లూనే ఉంటుంది. 

 

ఈ విష‌యంలో గ్రాఫ్ ఎక్క‌డా డౌన్ కాకుండా అనిల్ రావిపూడి చాలా కేర్ తీసుకున్నాడ‌నే చెప్పాలి. ఓవ‌ర్ ఆల్‌గా చెప్పాలంటే.. మంచి పవర్ఫుల్ గా ప్రారంభం అయ్యే ఈ సినిమా, మంచి ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్స్ అనంతరం, హిలేరియస్ కామెడీ తో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ తో మరింత జోష్ తో ముందుకు సాగుతుంది. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చిన‌ ఫైట్‌తో దీనికి చిన్న బ్రేక్ ప‌డింది. ఏదేమైనా మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రూ  ఫ‌స్టాఫ్‌కే ఫుల్ పైసా వ‌సూల్ అయ్యేలా క‌నిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాష్ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, బండ్ల గణేష్, సంగీతలు కీలకపాత్రల్లో నటించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: