టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉండేలా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 

 

ఇక  సినిమా క‌థ విష‌యంలోకి వెళ్తే...  హీరో మహేష్ బాబు ఎంట్రీ తరువాత మంచి పవర్ఫుల్ గా ప్రారంభం అయ్యే ఈ సినిమా.. మంచి ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్స్ అనంతరం, హిలేరియస్ కామెడీ తో నిండిపోతుంది. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే  ట్రైన్ జ‌ర్నీలో మ‌హేశ్ ను ర‌ష్మిక చూడ‌డం ప్రేమ‌లో ప‌డ‌డం త‌న తండ్రి రావు ర‌మేష్‌ చూసిన పెళ్లి న‌చ్చ‌క‌పోవ‌డం. ఇవ‌న్నీ వెంట వెంట‌నే జ‌రిగిపోతాయి.  ఆ వెంట‌నే మ‌హేష్‌ను లైన్‌లో పెట్ట‌డం ఎలాగైనా మ‌హేష్‌ను అప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అవుతారు. ఇలా సినిమా ఫ‌స్టాఫ్ ఎన‌భై నిమిసాల‌లో అస‌లు క‌థ‌లోకి సినిమా వెళ్ల‌దు. 

 

సినిమా స్టార్టింగ్ నుంచి ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కామెడీతోనే సినిమాను న‌డిపించేశాడు. ట్రైన్ ఎపిసోడ్ కామెడీ బాగానే ఉన్నా అస‌లు టైం అంతా అక్క‌డే కిల్ అవ్వ‌డంతో అంటే దాదాపు 30 నిమిసాలు ఆ సీన్ ఉండ‌డంతో ఒకానొక ద‌శ‌లో బోరింగ్ స్టేజ్‌కు వెళుతున్న‌ట్టు .. ఈ సీన్ ఎప్పుడు ముగుస్తుందా ? అన్న‌ట్టుగా ఉంటుంది. చివ‌ర‌కు ఇంట‌ర్వెల బ్యాంగ్ ఫైట్‌తో సినిమాకు మ‌ళ్లీ ఊపు వ‌స్తుంది. ఓవ‌రాల్‌గా ఫ‌స్టాఫ్‌లో క‌థ త‌క్కువ‌గాను కామెడీ ఎక్కువ ఉంటుంది. అయితే  ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో మ‌ళ్లీ ఊపు తెచ్చి సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: