సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు పెద్ద హీరోలంతా కోడిపందాల వ‌లె పోటీ ప‌డ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే ఎన్నో ఆశ‌ల‌తో బ‌రిలోకి దిగిన చిత్రాలు ఈ సంవత్స‌రం మొత్తం నాలుగు చిత్రాలు కాగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ రోజు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నందుకు భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం విడుద‌ల‌యింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బావు, ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవిశ్రీ‌మ్యూజిక్‌, రామ్‌ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. 

 

ఇక  ఈ చిత్రంలో మంత్రి ప్ర‌కాశ్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ ఒక‌టి ఉంటుంది. ఆ సీన్‌లో ప్ర‌కాశ్‌రాజ్ పెద్ద జ‌నాల‌ను వెంటేసుకుని వ‌చ్చి ఇది నా జ‌నం .. బ‌లం అని అంటాడు.. ఆ వెంట‌నే మ‌హేష్ జ‌నం బ‌లం గురించి డైలాగ్ చెపుతూ పొలిటిక‌ల్ లీడ‌ర్లు ముదుర్లు.. అయితే జ‌నాలు మ‌హాముదుర్లు వాళ్ల‌కు ఎటు కంఫ‌ర్ట్ ఉంటే అటు వెళ్లిపోతారంటూ ఓ సెటైర్ పేలుస్తాడు. ఇది సినిమాలోనే కాక బ‌య‌ట నార్మ‌ల్ జ‌నాల‌కు కూడా బాగా ఎక్కే డైలాగ్ అనే చెప్పాలి. ఇంత అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీతో ఈ క‌థ‌ను తెర‌కెక్కించారు అనిల్‌. ఆయ‌న గ‌త చిత్రాల‌న్నిటిలో కూడా డైలాగ్స్‌కి పెద్ద పీటే వేశార‌ని చెప్పాలి.  ఒక ర‌కంగా మ‌హేష్‌తో చాలా పెద్ద పెద్ద డైలాగ్‌లే అనిల్ చెప్పించిన‌ట్లు అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను ట‌చ్ చేస్తూ అనిల్ చాలా అద్భుతంగా తెర‌కెక్కించార‌నే చెప్పాలి. ఇక ఈ చిత్రం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. చాలా మంది మెయిన్ యాక్ట‌ర్స్ ఈ చిత్రం నుంచి రీ ఎంట్రీ ఇచ్చారు. విజ‌య‌శాంతి, సంగీత, బండ్ల గ‌ణేష్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫుల్ కామెడీ అండ్ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: